తెలంగాణ

పసుపు సాగులో నూతన ఒరవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూన్ 12: పసుపు సాగు విధానంలో ఆధునీకతను తీసుకువచ్చి అధిక దిగుబడులు పొందేలా ప్రభుత్వం చేపట్టిన పైలెట్ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. పురాతన విధానాలకు స్వస్తి పలికి, నూతన సాగు విధానాలను అలవర్చుకునేలా రైతులను సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో తొలి విడత నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 100 మంది రైతులను ఎంపిక చేశారు. అందులో 80 మంది రైతులతో బాల్కొండ సింహ భాగాన్ని పొందింది. నూతన పసుపు విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు 75 శాతం సబ్సిడీతో ఎంపిక చేసిన రైతుల భూముల్లో పసుపు పంటను సాగు చేయనున్నారు.
మూడు వారాల క్రితమే దీనికి సంబంధించి ఎంపిక చేసిన రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించారు. తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ రైతుల భూముల్లో బెడ్ పద్ధతిలో ట్రాక్టర్లతో దున్నుతున్నారు. మోర్తాడ్‌లోనూ ఎంపిక చేసిన ఆరుగురు రైతుల భూముల్లో ఉద్యానవన శాఖ అధికారులు ఈ పనులను ప్రారంభించారు. పసుపు సాగులో రైతులు ఇన్నాళ్లు తమకు తెలిసిన విధానాలనే ఉపయోగిస్తూ వచ్చారు. వారు పండించిన పంటలోనే విత్తనాలను సేకరించి, మళ్లీ పంటను పండించేవారు. దానివల్ల అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పసుపు దిగుబడులు రావడం లేదని భావించిన ఉద్యానవన శాఖ.. ప్రభుత్వ ఆదేశాలతో ఈ పైలెట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన సేలం రకం విత్తనాలను లబ్ధిదారులైన రైతులకు అందజేస్తారు. ఇప్పటికే గ్రామాల వారిగా ఎంపిక చేసిన రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించిన ఉద్యానవన అధికారులు.. ఆ మేరకు ఇటీవల వారి భూముల్లో పనులను ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా భూములను దున్నడం దగ్గరి నుండి దిగుబడులు వచ్చేవరకు ప్రతి భాగంలో ప్రభుత్వం 75 శాతం వాటాను భరించనుంది. మిగిలిన 25 శాతం ఖర్చులను రైతులే భరించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను కూడా ఉద్యానవన శాఖ అధికారులే సరఫరా చేస్తారని మండల ఉద్యానవన శాఖ అధికారి సునీల్ తెలిపారు. ప్రస్తుతం మోర్తాడ్‌లో ఆరుగురు రైతులను ఎంపిక చేశారు. వారి భూముల్లో ఆధునిక పసుపు సాగు పనులను ప్రారంభించినట్లు సునీల్ చెప్పారు.
ప్రస్తుతం ఈ ఆరుగురు రైతులు పండించిన పసుపు పంటను దిగుబడులు వచ్చిన వెంటనే విత్తనాలుగా వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. అంటే రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులందరికి పూర్తిస్థాయిలో సేలం విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ద్వారా మామూలు పంట దిగుబడుల కంటే అధికంగా వస్తుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రైతులు సాగు చేసే సాధారణ రకం పసుపులో ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే చేతికి అందుతుండగా, ఫైలెట్ ప్రాజెక్టు ద్వారా పంట సాగు చేసిన భూమిలో 40 నుండి 45 క్వింటాళ్ల పసుపు చేతికి అందుతుందని అధికారులు చెబుతున్నారు.