తెలంగాణ

ఫలించనున్న దశాబ్దాల కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 8: మహబూబ్‌నగర్ జిల్లా రైతుల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనుంది. జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబోగుడ, గుడిపల్లిగట్టు ఎత్తిపోతల పథకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పనులు చివరి దశల్లో ఉండడంతో జూలై నెలాఖరు నాటికి రెండు లిఫ్టులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఖరీఫ్‌లోనే 1.50 లక్షల ఎకరాలకు కృష్ణాజలాల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జూన్ నెలాఖరు వరకు రెండు లిఫ్టుల పనులను దాదాపు పూర్తి చేసి ఈ ఖరీఫ్‌లోనే కృష్ణాజలాలను బీడువారిన పొలాలకు పారించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడం ఇందుకు అనుగుణంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో ఇటీవల సమావేశం ఏర్పాటు చేసిన వచ్చే ఏడాది జూలై నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ గుడిపల్లిగట్టు, జొన్నలబొగుడ లిఫ్టులను ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో యుద్ధప్రాతిపదికన అధికారులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో జూలై చివరి వరకు కృష్ణమ్మ పరవళ్లు వస్తే ఆ నీటిని కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మళ్లించుకుని శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ఈ రెండు లిఫ్టులను ప్రారంభించేందుకు ప్రభుత్వ సర్వం సిద్ధం చేసింది. రూ.3081 కోట్ల అంచనాలతో 23 మండలాల్లోని 303 గ్రామాలకు సంబంధించి 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. ఇప్పటికే ఈ పథకానికి సంబందించిన లిప్ట్-1 ఎల్లూరు రిజర్వాయర్ ప్రారంభమై రెండేళ్లు దాటింది. లిఫ్ట్-2 జొన్నలబొగుడ, లిప్ట్-3 గుడిపల్లిగట్టులను త్వరలోనే ప్రారంభించాలని సర్వం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన కరెంట్ సరఫరాతో పాటు మోటార్ల బిగింపు ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరుకుంది. ఈ లిప్ట్‌ల ద్వారా 1.50 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లోనే సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ ప్రాంత రైతాంగానికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణాజలాలు బీడువారిన తమ భూములకు వచ్చి చేరుతాయని కొండంత ఆశతో రైతాంగం ఎదురుచూస్తున్నారు.