తెలంగాణ

దేశంలోనే.. అత్యంత ఎత్తులో జాతీయ పతాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: దేశంలో కెల్లా ఎత్తయిన, అతి పెద్ద జాతీయ పతాకాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద జూన్ 2న ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. 301 అడుగుల ఎత్తులో ఈ పతాకం ఉండాలని, దానికి అనుగుణంగా పోల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచిలో 293 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఉంది. అంత కంటే ఎత్తయిన స్తంభం, అంతకంటే పెద్దజెండా తెలంగాణలో ఎగుర వేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల్లో జాతీయ భావనను పెంచడానికి ఈ చర్య దోహదపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.