ఆంధ్రప్రదేశ్
ఆర్టివో ఏజెంట్ల ఆఫీసుల్లో సోదాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒంగోలు, మే 2: జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు అధికారులు ఆర్టిఒ కార్యాలయం బయట ఉన్న ఏజెంట్ల కార్యాలయాలపై సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై కాకినాడ డిటిసి ఆదిమూలం మోహన్ ఎసిబికి చిక్కిన నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్టీఎ ఏజెంట్ల కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం బ్రోకర్ల వ్యవస్ధను చాలా ఏళ్ల కిందట రద్దుచేసింది. ఈనేపధ్యంలో ఒంగోలులోని ఆర్టిఒ కార్యాలయం ఎదుట బ్రోకర్లు ఉండి కార్యాలయ సిబ్బందితో కుమ్మకై వాహనదారులకు సేవలు అందిస్తున్నట్లుగా తమ దాడుల్లో తెలినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ఎఎస్పి బాలవెంకటేశ్వరరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. కాగా తమ కార్యాలయంలో ఎవరు మధ్యవర్తులు లేరని జిల్లా ఆర్టిఒ వెల్లడించారు.