తెలంగాణ
వరంగల్ జడ్పీకి జాతీయ అవార్డు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
హైదరాబాద్, ఏప్రిల్ 25: పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులను రాష్ట్రం నుంచి వరంగల్ జిల్లా పరిషత్, మెదక్ జిల్లా సిద్ధిపేట, మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లి రెండు మండలాలు, మరో నాలుగు గ్రామపంచాయతీలు అందుకున్నాయి. జంషెడ్పూర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అవార్డులను అందుకున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ అనితా రామచంద్రన్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ‘గ్రామోదయ్ సే భారత్ ఉదయ్’ పేరిట ఎంపిక చేసిన అవార్డులకు వరంగల్ జెడ్పీ, సిద్ధిపేట, తలకొండపల్లి మండలాలు ఉన్నాయని పేర్కొన్నారు.