తెలంగాణ

జటిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 25: నల్లగొండ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత ముదురుతున్న కొద్దీ పల్లెలు, పట్టణాల్లో మంచినీటి బోర్లు, బావుల్లో నీరు అడుగంటి పోతుండటంతో తాగునీటికి జనం అలమటిస్తున్నారు. కరవుతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలాలు 22 నుండి 31 మీటర్ల మేర దిగువకు పడిపోవడంతో చందంపేట, దేవరకొండ, పిఏపల్లి, మేళ్లచెర్వు, దామరచర్ల, పెద్దవూరా వంటి 22 మండలాల్లో మంచినీటి సమస్యలు అధికమయ్యాయి. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. మంచినీటి సమస్యలను అధిమగించేందుకు అద్దె బోర్లు, ట్యాంకర్లతో, పైప్‌లైన్లతో అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా అవన్ని జనం దాహర్తిని తీర్చలేకపోతున్నాయి. జిల్లా కేంద్రానికి 130కిలోమీటర్ల దూరంలో కృష్ణానది చెంతనే ఉన్నా పొగిళ్లలో ఊరంతటికి దశాబ్ధాలుగా తాగునీటిని అందిస్తున్న ఊటబావి అడుగంటిపోవడంతో తాగునీటికి, ఉపాధికి కటకట ఎదురవ్వడంతో ఊళ్లో ఉండి చేసేది లేక 1000మంది జనాభాలో 700మంది వరకు వలస పోయారు. ఇక్కడ ఇంటింటికి తాగునీటి కోసం ప్రత్యేకంగా డ్రమ్ము అమరికతో రూపొందించిన ఎండ్లబండ్లతో తాగునీరు తరలించుకుంటున్నారు. బావిలో నీరు ఊరేదాకా వేచి చూసి వంతుల వారిగా జనం తాగునీటిని ఎండ్లబండిపై తీసుకెళ్తున్నారు. కిలోమీటర్ దాకా ఉండే ఈ బావి మట్టిదారి రాళ్ల మయమై ఉండగా సిసి రోడ్డైన వేస్తే ప్రజలకు కొంత సౌకర్యంగా ఉండేది. జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ దత్తత గ్రామంగా ఉన్నప్పటికీ తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. మంత్రి జగదీష్‌రెడ్డి దత్తత గ్రామం కంబాలపల్లి, పిఏపల్లి మండలం పెద్దగట్టు, అడవిదేవులపల్లి, మేళ్లచెర్వు, దేవరకొండ బాపుజినగర్ కాలనీ, నడిగూడెం త్రిపురవరం ఎస్సీ కాలనీల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా సక్రమంగా సాగక గ్రామాల్లో వంతుల వారిగా నీళ్లందిస్తున్నారు. తుర్కపల్లి మండలం కొండాపురం, కడిశల గడ్డతండాల్లో మంచినీటి కోసం ట్యాంకర్ల ద్వారా గిరిజనులు గంటల తరబడి నీటి కోసం తిప్పలు పడుతున్నారు. తండాలో ఉన్న ఒక్క బోరు నీరు సరిపడకపోవడంతో ఉపాధి పనులు, కూలీ పనులకు వెళ్లే ఆతృతలో మంచినీటి కోసం మహిళలు సిగపట్లు పడుతున్నారు. మఠంపల్లి, మేళ్లచెర్వులలో అధికంగా 129ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. చండూర్, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్ మండలాల్లో పలు గ్రామాల్లో కృష్ణా మంచినీటి పథకాల చివరి గ్రామాల్లో నాలుగు రోజులకొకసారి నీటి సరఫరా సాగుతుంది. సాగర్ ఎడమకాలువ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి చెరువులకు ఫీడర్ చానెల్స్ లేక ఇటీవల సాగర్ నీటిని విడుదల చేసినప్పటికి చెరువులను నింపలేపోయారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 756గ్రామాల్లో 1170బోర్లను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నారు. మరో 81గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.