ఆంధ్రప్రదేశ్
బాబువన్నీ బీసీల వ్యతిరేకచర్యలే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 March 2020
విజయవాడ(సిటీ), మార్చి 3: పాత కాలం సామెతలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న అంగిట బెల్లం అత్మలో విషం అనే సామెత పూర్తిగా చంద్రబాబు నైజాన్ని తెలుపుతుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. బాబు చేసే పనులన్నీ బీసీలను అణగదొక్కేలా అంటాయంటూ మంగళవారం ట్విట్టర్లో ఆరోపించారు. పైకి ఎక్కడాలేని ప్రేమ నటిస్తూనే మరో వైపు మాత్రం బీసీలను అణగదొక్కే పనులు చేస్తుంటాడని ఆరోపించారు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటూనే, తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశారని వ్యాఖ్యానించారు.