తెలంగాణ

పేద రైతులకే ‘రైతుబంధు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుబంధు పథకానికి నియమావళి రూపొందించే అవకాశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎలాంటి షరతులు లేకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఇపుడు ఐదెకరాలలోపు ఉన్నవారికి ఎలాంటి ఆలోచన లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారని స్పష్టమైంది. 5 నుండి 10 ఎకరాల మధ్య ఉన్న వారికి అమలు చేయడంలో ఆలోచన చేస్తున్నారు. 10 ఎకరాలు పైబడ్డ వారికి రైతుబంధు ఇవ్వకపోయినా ఫరవాలేదని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే 2020 జనవరిలో 5,100 కోట్ల రూపాయలను రైతుబంధు పథకం కోసం విడుదలు చేస్తున్నట్టు జీఓ జారీ అయినప్పటికీ, 3,000 కోట్ల రూపాయలను మాత్రమే ఆర్థిక శాఖ విడుదల చేసింది. మిగతా నిధులు విడుదల చేయలేదు. దాంతో ఇప్పటివరకు ఐదెకరాలలోపు రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున జమ అయ్యాయి. ఐదెకరాలు పైబడ్డ వారికి జమ కాలేదు. ఎప్పు డు జమ అవుతాయన్న అంశంపై అధికారులు స్పష్టం చేయలేకపోతున్నారు. 2018 మేలో ప్రారంభమైన ఈ పథకానికి సంబంధించి మొట్టమొదటిసారి ఖరీఫ్ సీజన్ పారంభం కాకముందే రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశారు. అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు నిధులు ముందుగానే విడుదల చేశారు. 2018 చివరలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత రబీ (2018-19) సీజన్ ప్రారంభమైంది. రబీ సీజన్‌లో తీవ్రమైన జాప్యం జరిగింది. ఆ తర్వాత నిర్ణీత సమయానికి పంటల పెట్టుబడికి రైతులకు నిధులు అందడం లేదు. రైతులందరికీ రైతుబంధు కింద ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది.