Others
అగ్ని వర్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 February 2020
-జయకృష్ణ పెనుమర్తి 9491883928
ఎడారిలో పూల వర్షంలా
రాలుతున్న నక్షత్రాలను నా చేతులు
ఆనందంగా స్వీకరిస్తున్నాయి
ఇప్పుడు నాకు భయం లేదు
ఎండుటాకులపై ఒక పదఘట్టన
బహుశా ప్రియురాలి పలకరింపు కావచ్చు
లేదా - ఒక్కసారిగా విరుచుకుపడ్డ
అగ్ని సర్పం స్పర్శ కావచ్చు
అయినా నాకు ఇప్పుడు భయం లేదు
నిస్తేజం శాఖోపశాఖలుగా విస్తరించిన
నా శరీరం దాహాగ్ని కుసుమం కోసం
ఎదురుచూస్తోంది
అట్టడుగున వేళ్లూనుకున్న దారులన్నీ
పక్కకు తొలగి ఒక సుదీర్ఘ ప్రయాణానికి
స్వాగతం పలుకుతూ తమ
చీకటి ద్వారాలను తెరచి ఎదురుచూస్తున్నాయి!
ఇప్పుడిక భయమనే
మాటకు అవకాశం లేదు!