ఆంధ్రప్రదేశ్‌

కాలుష్య రహితంగా కాలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాలుష్యానికి గురైన కాలువలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్‌పై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలువలను అందంగా ఉండేలా ఆధునీకరించాలన్నారు. సాగుకు, తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించడంతో పాటు అన్ని నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను శుద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కాలువ గట్లు ఇకపై ప్రజలకు వాకింగ్ ట్రాక్‌లుగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు అవసరమైన మిషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంస్థలను భాగస్వాములను చేయాలన్నారు. మిషన్ వెబ్ సైట్ ప్రారంభించాక మాట్లాడుతూ కాలువల్లోని కాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి డెల్టా పరిధిలో 10 వేల కిలోమీటర్ల మేర, కృష్ణా డెల్టాలో 9800 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. కాలువల సుందరీకరణలో
లైనింగ్ లేని చోట పచ్చదనం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. కాలువ గట్లపై రాళ్లలో పాత్‌వేలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పనులు జరిగేలా చూడాలన్నారు. టాస్క్ఫోర్సు ఏర్పాటు చేసి ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్, పురపాలక శాఖ, ఎన్జీవోలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఒక్కో కాలువలో ఎంత మురికి నీరు కలుస్తోంది, దాని నివారించేందుకు ఎంత ఖర్చు అవుతుందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగు శుద్ధి ప్లాంట్‌లను నిర్వహించేందుకు నిధులు సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. ముందుగా విజయవాడ, విశాఖల్లో కాలువల సుందరీకణ పనులు చేపట్టాలన్నారు. 18 మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థల పరిధిలో, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాలువలను తీర్చిదిద్దాలన్నారు. పులివెందులను కూడా చేర్చాలన్నారు. ముందుగా కాలువ కట్టలపై ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలన్నారు. వాళ్లు ఇళ్లు కట్టుకున్నాక తరలించాలన్నారు. తరలింపును తాడేపల్లి మున్సిపాలిటీ నుంచి ప్రారంభించాలని, ఇళ్ల తరలింపులో మానవత్వంతో వ్యవహరించాలన్నారు. మురుగు శుద్ధి ప్లాంట్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి మూడు నెలల్లో నివేదికలను సిద్ధం చేయాలన్నారు. కృష్ణా జిల్లాలో రైవస్ కాలువ, గుంటూరు జిల్లాలో వెస్ట్రన్ కాలువ, పశ్చిమ గోదావరి జిల్లాలో జీఈ మెయిన్ కాలువ, పులివెందుల, విశాఖపట్నంలను పైలట్ ప్రాజెక్టులుగా చేపట్టాలన్నారు. ఇప్పటి పరిస్థితిని, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన కలిపించాలన్నారు. వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి ముందుకు వచ్చే దాతల పేర్లతో నిర్మించాలన్నారు. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి సారించాలన్నారు. సమీక్షలో మిషన్ డైరెక్టర్ కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... వెబ్‌సైట్ ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి జగన్