Others
సూర్య శతకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 January 2020
కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262
తే.గీ. వ్యసనముల బారినంబడి యధికమైన
ఘోరయిక్కట్ల పాలయి కూలి పోవ
నేమి సాధింతురో గదా! నిలువలేకఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ లోకంలో ఎంతో మంది వ్యసనాల బారిన పడి భయంకరమైన ఎన్నో కష్టాలు పాలయి నిలద్రొక్కుకోలేక కూలిపోతుండడం వల్ల సాధించేదేమీ లేదని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! అట్టివారికి జ్ఞానోదయం కలిగించవయ్యా స్వామీ!
తే.గీ. మిగుల నలరారు చందాన మేలుగోరి
యడుగఁ గదుపంగ లేకున్నట్టి జన్మ
మేల? నిస్తేజవౌగదా! యిలను ఁగనగఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఎంతో ప్రకాశించే విధంగా మేలుగోరి అడుగు కదపలేని పక్షంలో అటువంటి జన్మదేనికి? ఆ జన్మ నిస్తేజమైపోతుందికదా. మేలు కోరుకుంటూ ముందుకు సాగిపోవాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! నీ ప్రబోధం కొనసాగించుము స్వామీ!