ఆంధ్రప్రదేశ్‌

రాజధానిపై ప్రభుత్వం తరఫున వాదించనున్న ముకుల్ రోహిత్గీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జనవరి 22: రాజధాని తరలింపుపై హైకోర్టులో దాఖలైన కేసులను వాదించేందుకు దేశ మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ఆయనకు ఐదు కోట్ల రూపాయల ఫీజును ఖరారు చేస్తూ అందులో కోటి రూపాయలు తక్షణం అడ్వాన్స్‌గా చెల్లించేలా ప్రణాళిక విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు రాజ్యాంగపరమైన అంశాల్లో పేరుగల రోహిత్గీని ఈ కేసు వాదించేందుకు నియమించుకుంటున్నామని ప్రణాళిక విభాగం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీఆర్‌డీఏపై హైకోర్టులో నేడు విచారణ
రాజధాని తరలింపు, సీఆర్‌డిఏ రద్దుపై హైకోర్టులో జరుగుతున్న విచారణ గురువారానికి వాయిదా పడింది. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి నుంచి కార్యాలయాలను తరలింపును ఆపేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వివరిస్తూ పిటిషనర్ తరపున న్యాయవాదులు పేర్కొంటున్న అంశాలపై శాసనమండలిలో చర్చ జరుగుతోందని, అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోర్టును కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఆదేశించింది.
రాజధాని గ్రామాల్లో నిరసనలు చేస్తున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులపై విచారణ జరుపుతున్నట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.