తెలంగాణ

బీజేపీ అంటే భయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ‘బీజేపీ అంటే మాకు భయమా? అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు పోయినందుకా? మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకనందుకా? ఆ పార్టీకి ఏం బలముందని భయపడాలి?’ అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే కేటీఆర్‌కు భయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ సోషల్ మీడియా విభాగం సమావేశంలో కేటీఆర్ స్పందించారు. వాళ్లకు మాదిరిగా తమకు బాసులు ఢిల్లీలో లేరని, గల్లీలో ఉన్నారని ప్రజలే తమకు బాసులన్నారు. తనకు మోదీ అన్నా రాహుల్ అన్నా ఏం భయం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరు వందలకు పైగా స్థానాల్లో బీజేపీ
అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో డిపాజిట్ పోయిందన్న విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటనలకు ప్రజలు నవ్వుకుంటారన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక, కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్లలో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాగే మున్సిపాలిటీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో, టీఆర్‌ఎస్ హయాంలో విడుదల చేసిన నిధులెన్నో శే్వతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో విడుదల చేసిన నిధుల కంటే తాము ఐదేళ్లలో విడుదల చేసిన నిధులు రెట్టింపని వివరించారు. కాంగ్రెస్ హయాంలో 14 రోజులకోసారి పట్టణాల్లో మంచినీళ్లు సరఫరా చేసేవారని, అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడైనా ఉందా? అని కేటీఆర్ నిలదీశారు. పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ బల్బుల ద్వారా విద్యుత్ వినియోగంతోపాటు కోట్లాది రూపాయలు ఆదా చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక మరో నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే సాధారణ ఎన్నికలు తప్ప మరే ఎన్నికలు లేవన్నారు. అప్పటి వరకు మున్సిపల్ కొత్త చట్టం అమలు, పాలనపై దృష్టిసారిస్తామన్నారు. మున్సిపాలిటీలలో అవినీతికి ఆస్కారం లేకుండా అవినీతిరహిత వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేక సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అదే మీడియా ద్వారా తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం సంప్రదాయ మీడియాకు బలమైన ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా ఎదిగిందని అన్నారు. ఇతర పార్టీల మాదిరిగా టీఆర్‌ఎస్‌కు పెయిడ్ సోషల్ మీడియా బలగం లేదన్నారు. తమకున్నదల్లా సీఎం కేసీఆర్‌పై అభిమానం ఉన్న బలమైన సోషల్ మీడియా సైన్యమని అన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మంచి పనులను ప్రతి గడపకు చేరవేసే బాధ్యత సోషల్ మీడియా విభాగంపైనే ఉందన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలాంటి వేధింపులు ఎదురైనా పార్టీ అండగా ఉంటుందని, తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లుగా సతీశ్, క్రిషాంక్, జగన్, దినేశ్ నలుగురిని నియమించినట్టు కేటీఆర్ ప్రకటించారు.

'చిత్రం...హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియాకు దిశానిర్దేశం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు