Others

మానవత్వంతో మెలగాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో మానవత్వం మంటగలిసి దారుణ మారణాల దిశగా పయనిస్తోంది. అదేం దుర్విధ ప్రకోపమో- చెక్కిలి తడి ఆరని ఆడ ముద్దుకూనలపై మానవ మృగాలు మదోన్మాద పశువులు లైంగికంగా విజృంభించి ఆరేడేళ్ళ ఆడపిల్లల్ని చెరచి అమానుషంగా హత్యాకాండకు పూనుకోవడంపట్ల సభ్య సమాజం హుతాశులై ఆడపిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై భయభ్రాంతులవుతన్నారు. ఈ మృగ మానవ మదోన్మాదం పసిపిల్లలపై కాకుండా వయసుమళ్లిన వృద్ధులను సైతం కబళించేస్తున్న వైనం మానవజాతికి చెరిగిపోని మచ్చ. ఆప్తులు, దగ్గరవారనుకున్న బంధువులు, రోజూ పలకరించే ఇరుగుపొరుగులే అంతర్ముఖంగా పైశాచితకత్వాన్ని కడుపులో దాచుకొని, అదను చూసి వాటేసే మానవ మృగాలు నేడు సమాజంలో సర్వత్రా కొట్టొచ్చినట్లు కనబడుతుంటారు.
చట్టాల్ని నీరుగార్చుతున్న వైనం
చట్టపరంగా ఎంతో కఠినతరమైన చట్టాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టినా, గుర్తుంచుకోని తాత్సారం, వంటికి పట్టిన పొగరుబోతుతనంతో చట్టాల్ని సైతం ధిక్కరించి క్షణికావేశంతో క్షణికానందంకోసం ఆడజాతిని కాముకతో విజృంభించి జీవితాలను చిదిమేస్తున్న రాక్షస ప్రవృత్తికి అడ్డుకట్టవేసే ప్రబలశక్తి ఏదీ?
కామప్రకోపంతో మృగోన్మాదులు
సమాజంలో కొంతమంది తమకే తెలియని ఉన్మాదంతో తప్పని తెలిసినా, అదే మానసిక స్థితిలో అందుబాటులో వున్నవారిని అవకాశాల కోసం ఎదురుచూసి అదను దొరగ్గానే తరతమ భేదాల్ని విస్మరించి దొరకబుచ్చుకొని వారి అంతం చూసేవరకు ఈ ఉన్మాదులు శాంతించడంలేదు. ఎదుటివ్యక్తి ఎవరైనా కానీ, ఎలాంటి అంతరంగంతో ఉందో కూడా గుర్తించకుండా నన్ను ప్రేమిస్తావా, లేకపోతే యాసిడ్ కుమ్మరించనా, పదునుకత్తికి బలిపెట్టనా అంటూ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఘాతుక చర్యలకు తెగబడి అన్నంత పనిచేస్తున్న దుర్భల, బర్భర మనస్కుల్ని మానసిక విశే్లషకులు మానవ ఉన్మాదులుగా పేర్కొంటున్నారు. క్షణికావేశాలకు లోనై కని పెంచిన తల్లిదండ్రులను నిరంతర శోకంలో ముంచి తాము సైతం దుర్భర కారాగార జీవితాన్ని కొనితెచ్చుకోవడం ఏ సుఖానికి నాంది? క్షణికావేశానికి లోనై జీవితాంతం ఈ దుస్థితిలో కునారిల్లడం ఏ మానవ ప్రగతికి నాంది? జీవితంలో ఢక్కా మొక్కీలు తిన్న అరవై ఏళ్ళ వృద్ధులు సైతం పసిపిల్లలను ప్రేమగా చేరదీసి వారి మానప్రాణాల్ని బలిగొనడం ఏ వివేక ప్రస్తానానికి నాంది?
ఆడబిడ్డంటే వివక్షత, ఆడ పుట్టుక జరగరాని అఘాయిత్యమేదో జరిగినట్లు కుటుంబానికి కుటుంబమే కలవరపాటు. అత్తా ఒకింటి కోడలని గుర్తుండబోదు. కోడలు ఆడబిడ్డను కంటే ఇంటిల్లిపాదికి కంటగింపు. మరింతగా ముందుకువెళ్లి పుట్టిన పసిగుడ్డును పొదల్లోనో, చెత్తకుండీల్లోనో, మురుగుకాల్వల పాల్జేసే పాశవికతకు ఒడికట్టి అంతమొందించడం ఈనాటి రుజువర్తనగా మారింది. కొందరైతే స్కానింగ్ చేయించి ఆడపిండమైతే అక్కడికక్కడే భ్రూణహత్యలు చేయించడానికి వెనుకాడబోరు. సృష్టి ఆలంబన అయిన ఆడపిల్లల్ని అణగార్చడమే మానవత విలువలకు పరాకాష్టని ఆడపిల్లల వ్యతిరేక మానసికోన్మాదులు భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో, గిరిజన తండాలలో ఆడపుట్టుకను వారు భరించలేరు. అవిద్య, దారిద్య్రం, ఆకలి, మూఢాచారాలతో నిత్యం భయానక దుర్భర జీవనయానంలో ఆడపిల్లల్ని మన్ననగా, మర్యాదగా చూడటం వారికి అలవాటు లేని విషయం. కౌమార యువతులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లనే వారి బతుకులు దారం తెగిన గాలిపటంలాగా గమ్యం తెలియని పయనంలో వ్యభిచార గృహాల చెరసాలల్లో పడి నిండు జీవితాలు బలైపోతున్నాయి.
సమాజానికి, గృహస్థ జీవితానికి ఆడదే ఆధారం అని విజ్ఞులు ఘోషిస్తున్నా, వివక్షత, మగ అహంకారంతో మహిళల్ని నిరంతరం క్షోభపెట్టే దిశగా కొంతమంది ఆధిక్యత ప్రవర్తించి, వారిని అధిక్షేపించడం సభ్య సమాజంలో గర్హించదగ్గ విషయం. విశ్వవ్యాప్తంగా మహిళలు లేని రంగమంటూ ఏదీ లేదు. ప్రతి రంగంలోనూ ఆడవారు తమ అసమాన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్నలు అందుకొంటున్నవేళ మగవారు మానవతతో మహిళల్ని సమాదరించి అకృత్యాలకు అరాచకాలకు పాల్పడకుండా మానవీయ కోణంలో ఆలోచించి సమసమాజ నిర్మాణానికి సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి 9885326493