ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో 1 నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న టీటీడీ ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి శనివారం తిరుమలలోని హోటల్స్, ఫాస్ట్ఫుడ్స్ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. గత నాలుగు రోజులుగా టీటీడీ ఆరోగ్య విభాగం హోటల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ నిషేధానికి హోటల్స్, ఫాస్ట్ఫుడ్స్ సెంటర్లు చేపడుతున్న చర్యలు క్షుణ్ణంగా పరిశీలించారు. అంజనాద్రి నగర్ బంకు వద్ద భక్తుల సౌకర్యార్థం బంకు యజమాని ఏర్పాటు చేసిన నీటి సౌకర్య విధానాన్ని పరిశీలించారు. జనవరి 1వ తేదీ నుంచి తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు అందుబాటులో ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భక్తులకు అవసరమైన తాగునీటిని 20 లీటర్ల క్యాన్ ద్వారా ఏర్పాటు చేసుకుని పేపర్ గ్లాస్ ద్వారా అందించాలని హోటల్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులకు తెలియజేశారు.