తెలంగాణ

పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు మరోసారి హైదరాబాద్ వేదికపై సందడి చేయనున్నాయి. వివిధ రంగాల్లో పెట్టబడులు పెట్టడానికి అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో ప్రముఖపాత్ర పోషిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంతర్జాతీయ కంపెనీలు ‘ఇండియా జాయ్’ కార్యక్రమానికి హాజరవుతున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్, డిజిటల్ దిగ్గజాలు హైదారాబాద్‌కు తరలిరానున్నాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది మీడియా ప్రతినిధులతో పాటు వేలాది మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించడానకి ప్రత్యేకంగా ఇమేజ్ టవర్ నిర్మాణం చేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇమేజ్ టవర్ ప్రముఖ కంపెనీలకు ఒక సెంటర్ ఎక్సలెన్సుగా పని చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇమేజ్ టవర్‌లో అంతర్జాతీయ స్థాయిలో వౌలిక వసతులు ఉంటాయన్నారు. మాదాపూర్‌లోని హైటెక్ సిటీలో ఇండియా జాయ్ వేదికకు సన్నాహాలు చేస్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

*చిత్రం... ఐటీ మంత్రి కేటీఆర్ ను ఇండియా జాయ్ ప్రతినిధులు