Others
నారీ విజయమే దీపావళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 October 2019
- ఎల్. ప్రపుల్లచంద్ర 88865 74370
తెలుగింట కళకళలాడే
తారాతోరణం దివ్య దీపావళి
రంగురంగుల బాణాసంచా సొగసులు
చిటపటలాడే టపాకాయల హంగామాలు
యువభావంలో నవరాగం పలికించిన
ప్రియమైన దీపావళి తెలుగింట ఆనందరవళి
మతాబుల షరాబులు తారాజువ్వల శరవేగాలు
నిజజీవితంలో నిలువుటద్దం దీపావళి
శాంతి సమైక్యతా ప్రతిరూపాలు
దీపావళి దివ్వెల సమూహాలు
క్రాంతిరేఖల సౌభాగ్యాలు
శ్రీ మహాలక్ష్మి సిరుల దీపావళి
ఇంటింటా దీపావళి పండుగ
జగమంతా దీపావళి సంబరాలు
రంగ రంగ వైభవంగా జరిగే దీపావళి
అపర సత్యభామ సాధించిన నారీ లోక విజయం ఇది..