తెలంగాణ

నేడు కాంగ్రెస్ ప్రగతిభవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రగతిభవన్ ముట్టడి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గడువు ముగియడంతో ప్రగతిభవన్ ముట్టడించనున్నట్టు టీపీసీసీ ప్రకటించింది.
ఈ కార్యక్రమంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు కొండపల్లి దయాసాగర్ తదితరులు ప్రగతి ముట్టడి వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశం ముగిసాక షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వానికి 19వ తేదీ వరకు కాంగ్రెస్ గడువు పెట్టిందన్నారు. సమ్మెను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నట్టు తాము ముందుగానే ప్రకటించినట్టు షబ్బీర్ అలీ గుర్తు చేశారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా సీఎం కేసీఆర్ ధిక్కరించారన్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం తీవ్రమైన చర్య అని, ఇలాంటి ఘటనలు మునుపెన్నడూ జరుగలేదన్నారు. ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం బేఖాతర్ చేసిందని షబ్బీర్ అలీ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయకపోవడమంటే ఇది ప్రజాస్వామ్య పాలనా? నియంత పాలనా? అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను అగౌరవపర్చడం ద్వారా సీఎం కేసీఆర్ తాను కోర్టులకు కూడా అతీతుడినన్న సంకేతాలు ఇచ్చారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికే తాము ప్రగతిభవన్‌ను ముట్టడించనున్నామన్నారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు వారికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిపోరాడుతుందని షబ్బీర్ అలీ తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సోమవారం తలపెట్టిన ప్రగతిభవన్ ముట్టడిని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికు సమస్యల పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం తనకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలతో 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడలు వంచే వరకు కార్మికుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్ ముట్టిడిని విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.