తెలంగాణ

హుజూర్‌నగర్ బహిరంగ సభలో భారీ నిరసనలు, ర్యాలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గురువారం పాల్గొనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో భారీ నిసనలు, ర్యాలీలు చేపట్టాలని విపక్షాలు పిలుపు ఇచ్చాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పూర్తి మద్దతును వామపక్షాలతో పాటు తెలంగాణ జన సమితి ప్రకటించాయి. సమ్మెను ఉధృతం చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం భేషరతుగా ముందుకు రావాలన్నారు. బుధవారం ఆర్టీసీ జేఏసీ నేతల్ని సీపీఎం తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జన సమతి నేత కోదండరామ్, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇక నుంచి సమ్మెను బలోపేతం చేయడానకి సకలజనుల సమ్మె రీతిలో ముందుకు పోవాలని విపక్షాల నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీలోని వేలాది మంది ఉద్యోగ, కార్మికులు తమ సమస్యలపై సమ్మెకు ప్రయత్నిస్తే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని వారు ధ్వజమెత్తారు. సమ్మెను నీరుగార్చడానికి పలు విధాలుగా సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సమ్మెను విరమించడానికి ప్రభుత్వం ప్రత్య చర్యలకు కాకుండ దొడ్డిదారిన ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. సమ్మెతో ప్రజా రవాణా వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నా ప్రభుత్వం కళ్లు ఉండి చూడలేని కబోదిగా వ్యవహరించడం పట్ల వారు కనె్నర్ర చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మంకుపట్టును విడనాడాలని వారు సూచించారు. గురువారం ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనన్ను సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసరలు, ర్యాలీలు చేపట్టాలని ఆయా పార్టీల కేడర్‌కు సూచించాయి. హైకోర్టు సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై భేటీలో పాల్గొన్న నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

*చిత్రం...జూబ్లీ బస్టాండు వద్ద కోదండరామ్, ఆఠ్టీసీ ఎంప్లాయాస్ ధర్నా