ఆంధ్రప్రదేశ్‌

‘నన్నయ’ ప్రొఫెసర్‌ను అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 15: రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో మహిళా రక్షణ కోసం అంతర్గత కమిటీలను పటిష్టవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లుచేస్తున్నామని, విద్యార్థినులు తమకు ఎదురైన ఏ కష్టమైనా స్వేచ్ఛగా ఈ కమిటీలకు చెప్పుకునే వాతావరణం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రతీ విద్యా సంస్థలో మహిళా కమిషన్ తరపున ఒక ప్రత్యేక విభాగానికి చర్యలు చేపడుతున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆదికవి నన్నయ యూనివర్సిటీలో విద్యార్థినులను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లీషు విభాగం హెచ్‌ఓడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ సూర్య రాఘవేంద్రను తక్షణం అరెస్టు చేయాలని డిమాండుచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అదేశాల మేరకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మంగళవారం రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో వేధింపుల ఘటనపై మంగళవారం విచారణ జరిపారు.
బాధిత విద్యార్థినులతో విడివిడిగా మాట్లాడారు. మహిళా అధ్యాపకులు, నిజ నిర్ధారణ కమిటీ అధ్యాపకులు, ఏడుగురు ఉన్నత స్థాయి కమిటీ సభ్యులైన నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి టి తులసి, ఏపీ సీఎల్‌ఏ అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు, న్యాయవాది పల్లె చంద్రశేఖర్ తదితరులతో మాట్లాడారు. అనంతరం వీసీ ఆచార్య పి సురేష్ వర్మతో చర్చించారు. పద్మ వెంట రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ వున్నారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ విచారణ నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఏ వర్సిటీలోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్సిటీల్లో, కొన్ని కళాశాలల్లో ఇంటర్నల్ మార్కులను అడ్డుపెట్టుకుని విద్యార్థినులను భయపెట్టడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఘటనలు జరుగుతున్నట్టుగా కమిషన్ గుర్తించిందన్నారు.
నన్నయ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూర్యరాఘవేంద్ర విద్యార్థినులతో జరిపిన సెల్ చాటింగ్ చూస్తే ట్రాప్ చేయడానికి ఎలా ప్రయత్నించిందీ వెల్లడవుతోందన్నారు. అధ్యాపకుల తీరును గమనించాల్సిన బాధ్యత వైస్-్ఛన్సలర్‌పై కూడా ఉందని, ఏదైనా ఫిర్యాదు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇదే విషయాన్ని వీసీని ప్రశ్నించామన్నారు. ఈ ఘటనలో విద్యార్థినులు ఆధారాలు బయట పెట్టిన తర్వాత గానీ వీసీ స్పందించలేదని అర్ధమవుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ ఉదంతంపై సీరియస్‌గా స్పందించారు కాబట్టే ఈ విషయంలో చర్యలు తీసుకోవడం మొదలైందన్నారు. ప్రాధమిక విచారణలో అతని తప్పుందని తేలింది కాబట్టే అతన్ని సస్పెండ్ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినందున తక్షణం అరెస్టు చేయాలని డిమాండుచేశారు.
*చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, చిత్రంలో ఎంపీ మార్గాని భరత్