ఆంధ్రప్రదేశ్‌

అసంపూర్ణంగా రైతు భరోసా పథకం: జనసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 15: రాష్ట్రప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన రైతు భరోసా పథకాన్ని ప్రస్తుతం అసంపూర్ణంగా అమలు చేస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు భరోసా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకంతో కలిపి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాది రూ. 12,500లు అందిస్తామని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో కలిపి రూ. 13,500లు ఇవ్వటం సమంజసం కాదన్నారు. నవరత్నాల్లో ఈ పథకాన్ని కేంద్ర సహాయంతో రూపొందిస్తున్నట్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పథకానికి అర్హులైన రైతులు సుమారు 86 లక్షలకు పైగా ఉండగా, 40లక్షల మందికే పరిమితం చేసి మిగిలిన వారికి అన్యాయం చేయటం సహేతుకం కాదన్నారు. కౌలు రైతుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలు సవరించాలని, భరోసా మొత్తాన్ని మూడు విడతల్లో కాకుండా రబీ, ఖరీఫ్ సీజన్లో రెండు విడతలుగా అందించాలని ఆయన కోరారు.