ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ విధానాలపై 16న రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: కార్పొరేట్లకు వరాలు గుప్పిస్తూ సామాన్యులపై భారాన్ని మోపుతున్న బీజేపీ విధానాలను వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు తీర్మానించాయి. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతిని చెల్లించడంతోపాటు ప్రభుత్వ పనులకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతి కార్మికునికి కనీస వేతనం నేలకు రూ. 21వేలు చెల్లించాలని, తీసివేసిన కార్మికులకు నెలసరి కనీస జీవన భృతిని కల్పించాలని కోరాయి. ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ నిలిపవేయాలన్నారు. విజయవాడ ఎంబీ భవన్‌లో ఆదివారం వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ సంస్థలకు మోదీ సర్కారు ఊడిగం చేస్తూ పేదలు, రైతులు, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలేదని విమర్శించారు. ఉత్పత్తిరంగంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా కార్లు, ట్రాక్టర్లు, ద్విచక వాహనాల కొనుగోలు శాతం 15 నుంచి 20కి తగ్గిందన్నారు. ఆర్థిక సంక్షోభం తీవ్రం కారడంతో అన్ని రంగాలూ వెనుకబడిపోతున్నాయని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలపై విధించే పన్నులను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం ద్వారా ఒకేసారి రూ. 1.45 కోట్ల రాయితీలు కార్పొరేట్లకు కేంద్రం కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంధ్యం వల్ల ప్రజాజీవనం అతలాకుతలం అయిందన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు డీ హరనాథ్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కారు సాగిస్తున్న దుర్మార్గ పాలనపై ప్రశ్నించాలని, లేదంటే భావితరాలు నష్టపోవడం ఖాయమన్నారు. ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనె్మత్స వెంకట సుందరరామరాజు మాట్లాడుతూ మతోన్మాద శక్తుల ఆగడాలను అడ్డుకుంటూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
*చిత్రాలు.. సదస్సులో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
*హాజరైన వామపక్షాల నాయకులు