ఆంధ్రప్రదేశ్‌

అనంతపూర్ జిల్లాలో 3 హజ్ ఈ -సేవ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: అనంతపూర్ జిల్లాలోని ముఖ్య పట్టణాలు అనంతపూర్, హిందూపూర్, కదిరి పట్టణాల్లో మూడు చోట్ల హజ్ ఈ -సేవ సెంటర్‌లను ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో ఉచితంగా హజ్ దరఖాస్తులు నింపడానికి హజ్ ఇ - సేవా సెంటర్‌లు పని చేస్తాయని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆదేశాల మేరకు ఉచితంగా హజ్ దరఖాస్తులు నింపడానికి, ఏపీ స్టేట్ హజ్ కమిటీ 13 జిల్లాల్లోనూ జిల్లా హజ్ సొసైటీల ద్వారా హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి సలహాలు, సూచనలు, సహకారం అందిస్తుందని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ అబ్దుల్ ఖాదిర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపూర్, హిందూపూర్, కదిరి పట్టణాల్లో ఈ సెంటర్‌లు ఏర్పాటయ్యాయి. అనంతపూర్ జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఈ హజ్ ఇ - సేవా సెంటర్‌ల సేవలు ఉపయోగించుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు భర్తీ చేసుకోవాలని ఎల్ అబ్దుల్ ఖాదిర్ విజ్ఞప్తి చేశారు. హజ్ దరఖాస్తు నింపడానికి చివరి తేదీ నవంబర్ 10 కాగా దరఖాస్తు ఫీజు రూ. 300 చెల్లించాల్సి ఉంది.