Others
మారేదెన్నడు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 August 2019
- ప్రసన్నాంజలి
అత్యాచారాలు, భ్రూణహత్యలు
లింగవివక్ష, గృహహింసా, వరకట్న వేధింపులు
లైంగిక దాడులు అంగట్లో బొమ్మలు ఎనె్నన్ని..
చట్టాలెన్ని వచ్చినా సమాజంలో మార్పు ?
సమాజంలో మనుష్యులు మారేదెన్నడు?
ఆడపిల్ల ఇంటికే లక్ష్మీ వంటూ
ఆదిశక్తిని నీవంటూ అంతటికీ కారణం నీవేనంటూ
అంతరిక్షంలో కాలిడినా ఈ ప్రపంచానే్న ఏలినా
భర్త ప్రేమను గెలుచుకున్న భార్యగా,
తండ్రి ప్రేమనందుకొన్న బిడ్డగా
తల్లికి తరగని గనిలా
ఇవి అన్నీ అక్షరాలకే పరిమితమా
మనుష్యులల్లో ఆలోచన మారేదెన్నడు?
మహిళా సాధికారత సాధించావు
భవిష్యత్తుతరాలకు మార్గదర్శి వయ్యావు
ఆత్మస్థైర్యంతో, ధైర్యం, పట్టుదలకు నీవే మారుపేరు
ఇన్నీ బిరుదులూ జాబితాలో చేర్పులేనా
చేతల్లో మార్పు ఎపుడు? మనుష్యులు మారేదెన్నడు?