ఆంధ్రప్రదేశ్
నిరాశతో వెనుదిరిగిన వైకాపా నేతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 April 2016
విజయనగరం: టిడిపిలో చేరాలనుకుంటున్న తమ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణను కలిసేందుకు బొబ్బిలి వచ్చిన వైకాపా నేతలు నిరాశతో వెనుదిరిగారు. వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ఉదయం బొబ్బిలి కోటకు చేరుకున్నారు. అయితే, సుజయకృష్ణతో ఆయన సోదరుడు బేబీనాయన కోటలో లేరన్న సమాచారం తెలిశాక వైకాపా నేతలు చాలాసేపు నిరీక్షించి చివరికి తిరుగుప్రయాణమయ్యారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా టిడిపిలో చేరతారన్న వార్తలు రావడంతో వైకాపా నేతలు అతడిని కలిసేందుకు బొబ్బిలి నుంచి బయలుదేరారు.