ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో సామాజిక విప్లవానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 19: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ ఆయా ప్రభుత్వాల మంత్రివర్గంలో కనిపించని సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నాంది పలికాని రాష్ట్ర రోడ్లు,్భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేయడం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన అంశాలు ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి కేబినెట్ ఏర్పాటు నుంచే సుస్పష్టంగా కనిపిస్తోందన్నారు. మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఇక్కడ జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగులు, కార్మికులు, అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దిశగా జగన్ ప్రభుత్వం వేస్తున్న అడుగులు అందరికీ తెలిసినవే అన్నారు. పారదర్శకత, అవినీతి రహిత ప్రభుత్వంగా జగన్ దేశంలో కొత్త రికార్డు సాధిస్తుందనడంలో సందేహం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రమాదవశాత్తు మరణం వెనుక మిస్టరీ, వివేకానందరెడ్డి హత్య, జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిపై అందరికీ అనుమానాలు ఉన్నాయని, అటువంటి సంఘటనలు ప్రతీకార చర్యలతో పాలన సాగుతోందా? అన్న ఆలోచనే రాకుండా జగన్మోహన్‌రెడ్డి కక్షసాధింపులు ఉండవ్ అంటూ ప్రకటించడం రాష్ట్రానికి ఎంత ముందుచూపుకలిగిన ముఖ్యమంత్రిని ఏపీ ప్రజలు ఎన్నుకున్నారో అర్థం అవుతుందన్నారు. రాజన్న రాజ్యం అంటే కుల, మత, వర్గ, ప్రాంతాల తేడాలేని రాజకీయా వివక్షలు, కక్షలు లేని రాజ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారని గుర్తుచేశారు.
అదేబాటలో ఆయన కేబినెట్ మంత్రులంతా పయనిస్తామని, అందులో తాను మొదటి వ్యక్తిగా ఉంటానంటూ వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి ప్రతీ నిరుపేద, మధ్యతరగతి గడపకి చేరేదాకా జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అందరి సహాయసహకారంతో జిల్లాలను ప్రగతిపథంలో నడిపిద్దామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, ఆఫ్‌షోర్ జలాశయాలను పూర్తి చేసుకొని సస్యశ్యామలంగా మారుద్దామని కృష్ణదాస్ అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలని, నీతివంతమైన పాలనకు అందరూ సహకరించాలని కోరారు. నవరత్నాలతో పేదోళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి వజ్రసంకల్పమని, అందుకు తాను శాయశక్తులా జగన్మోహన్‌రెడ్డికి అండదండగా నిలుస్తానంటూ చెప్పారు.
జగన్ నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు కేసులకు, దాడులకు వెరవకుండా అలుపెరుగని పోరాటం చేయడంవల్లే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజల కోసం, ప్రజల మధ్యనే ఉంటూ 2014 ఎన్నికల్లో జగన్ పోటీ చేశారని, కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు. కానీ, జగన్ ఎక్కడ వెనక్కు తగ్గకుండా జనం మధ్యనే ఉండడం వల్ల 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి నీరాజనం పట్టారన్నారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన తనకు మంత్రి పదవి, తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇచ్చి బీసీల పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్నారన్నారు. మేనిఫెస్టోలో చేర్చిన ప్రతీ ఒక్కటీ అమలుచేసే దమ్మున్న నాయకుడు జగన్మోహన్‌రెడ్డే అంటూ ఉద్ఘాటించారు. జిల్లాలో ఉన్న ప్రతీ సమస్య సి.ఎం. జగన్‌కు తెలుసునని, ఆయన పాదయాత్రలో ప్రజల బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ చూసిన తర్వాత మేనిఫెస్టోను కేవలం నాలుగు పేజీల్లోనే సిద్ధం చేసి ఐదుకోట్లు ఆంధ్రులకు అండగా నిలుస్తానని ఇచ్చిన భరోసాయే ఆయనను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పాల్గొన్నారు.

చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్