Others
కవితా పుత్రిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 April 2019
- డా. బుర్రా మధుసూదన్‌రెడ్డి, 9949700037
నాలో నేను.. నాతో నేను
మాట్లాడి పోట్లాడుకోవాలె
నా ప్రశ్నల వర్షంలో
జవాబులు తానమాడి
కవితాక్షరాలై వెలసి
బతుకు వెతల్ని పేల్చి
ప్రేమానురాగాల్ని నింపాలె!
పదాల వెంట పరుగు
కాదేమో కవిత్వం
పదాలు పరవశంలో నీ వశమై
భావ ప్రవాహంతో
మది మడుల్ని తడిపి.. తడిమి..
వినూత్న ఆలోచనా చిగుర్లు
మొలిపించి మురిపించాలె!
బతుకుదెరువా కవిత్వం?
కాదు.. కాదేమో...
లక్షల మేథల ఆకలి తీర్చి
కవి అనంత ప్రసవ వేదనలోంచి
జనించిన కవితాపుత్రిక
సకల సమాజాన్ని జాగృతపరిచి
అక్షరామృతానంద సంద్రంలో ముంచాలె!
దేహానికి గాయమైతే వైద్యమే
వికల మనసుకు వైద్యం మాత్రం
కవిత్వమే.. భావావేశమే!