ఆంధ్రప్రదేశ్
ఎపీ అసెంబ్లీ నుంచి వైకాప్ వాకౌట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 March 2016
హైదరాబాద్: నిరుద్యోగ భృతి, ఉపాధి విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఎపీ అసెంబ్లీలో గురువారం ఉదయం వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. విపక్షనేత వైఎస్ జగన్ మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తారని ఆశించిన యువకులు నిరాశలో మునిగిపోయారని, డిఎస్సీ పరీక్ష జరిగి నెలలు గడిచినా టీచర్ల నియామకాలు జరగలేదని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, కోర్టు వివాదాల కారణంగా టీచర్ల నియామకంలో జాప్యం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.