తెలంగాణ

తల్లడిల్లిన ఉల్లి రైతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గత ఏడాది ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తే, ఈసారి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. గత సీజన్‌లో ఓపెన్ మార్కెట్‌లో ఉల్లి ధర కేజీ 80 నుంచి వందకు చేరింది. రైతు బజార్లలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ఆధారాలు చూపితే ప్రభుత్వం సబ్సిడీతో ఉల్లిని అమ్మించింది. ఒకవైపు సబ్సిడీ భరిస్తూ ఉల్లి అమ్మించడంతో పాటు రైతులకు 70 శాతం సబ్సిడీతో ఉల్లి విత్తనాలు అందజేశారు. గత ఏడాది ఉల్లికి మంచి ధర రావడంతో ఈసారి ఉల్లి రైతులు పంటపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ధర దారుణంగా దిగజారింది. ఉల్లి హోల్‌సేల్ ధరలు క్వింటాకు 700 రూపాయలకు తగ్గుముఖం పట్టడంతో రైతులను ఆదుకోవడానికి మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో నేరుగా ఉల్లిని అమ్మే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు 70 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించారు. ఆ రైతులు కిలో 11 రూపాయలకు తక్కువ కాకుండా రైతు బజారులో ఉల్లి అమ్ముకోవడానికి ఏర్పాటు చేసినట్టు మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ఉల్లిని అమ్ముకోకుండా గుర్తించిన రైతు బజార్లలో 11 రూపాయలకు కిలో ధర తక్కువ కాకుండా అమ్ముకోవాలని సూచించారు.మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల పరిధిలో ఉల్లిగడ్డ అత్యధికంగా పండించే మండలాలు మోమిన్‌పేట, మర్‌పల్లి, సిద్దిపేట, చేవెళ్ల, శంకర్‌పల్లి, నవాబ్‌పేట్, శివంపేట్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అవగాహన కలిగించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రైతు బజారులో ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి వీలుగా ప్రత్యేక స్థలం కేటాయించాలని నిర్ణయించారు.