ఆంధ్రప్రదేశ్‌

విధ్వంసం.. విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 1: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆదివారం జరిగిన విధ్వంసం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. కాపుల ఐక్య గర్జన ఆద్యంతం ప్రశాంతంగా జరుగుతుందని ఆశించిన వారికి ఈ పరిణామం తీవ్ర బాధనే మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి వరకు తుని పరిసరాలు, పట్టణంలో భయానకమైన పరిస్థితులు కొనసాగగా, రాత్రికి రాత్రే వివిధ జిల్లాల నుంచి పోలీసు బలగాలు తరలివచ్చి జల్లెడ పట్టాయి. పట్టణంలో, బహిరంగ సభాస్థలి పరిసరాల్లో వేల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో పోలీసులు, 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలతో తుని పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. హింసాకాండకు భీతావహులైన స్థానికులు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. పట్టణంలో దుకాణాలు మూతపడ్డాయి. రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక రకాలుగా భారీ నష్టం వాటిల్లింది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు అగ్నికి ఆహుతి కాగా, రైల్వే ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ ఘటనాస్థలిలో పూర్తిగా దెబ్బతింది. రైల్వే కేబుల్, విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైల్వే శాఖాధికారులు ఉన్నతాధికార్లకు నివేదించారు. అలాగే రైళ్ళ రాకపోకల నిలుపుదల, వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ప్రయాణపు ఛార్జీలను వాపసు చేయటం, షెడ్యూల్ ప్రకారం నడవాల్సిన రైళ్ళను నిలిపివేసిన కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకించి పోలీస్ శాఖకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లినట్టు తుని పట్టణాన్ని సోమవారం పరిశీలించిన అడిషనల్ డిజి ఆర్పీ ఠాకూర్ స్పష్టంచేశారు. కోస్టల్ ఏరియా ఐజి కుమార్ విశ్వజిత్, అడిషనల్ డిజి ఠాకూర్ తదితరులు తునిలో సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖకు చెందిన సుమారు 25 వాహనాలు కాలి బూడిద కాగా, తుని రూరల్, టౌన్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలు దగ్ధమయ్యాయి. తునిలో సాధారణ స్థితి నెలకొనే వరకు భద్రతా దళాలను మోహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే హింసాత్మక సంఘటనలకు సంబంధించి వీడియో పుటేజీల ఆధారంగా నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. హింసాత్మక సంఘటనలలో తూర్పు, గుంటూరు జిల్లాలకు చెందిన వారితోపాటు హైదరాబాద్, కడప జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. వీడియో పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి, ఆయా జిల్లాల పోలీస్ స్టేషన్లకు వివరాలను పంపనున్నట్టు ఠాకూర్ చెప్పారు.

చిత్రం... భారీగా తరలివచ్చిన పోలీసులు