తెలంగాణ

అంత సీనుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అంత పెద్ద మొత్తంలో నిధులెక్కడి నుంచి సమీకరిస్తారంటూ ‘ఆంధ్రభూమి’ హైదరాబాద్ ఎడిషన్‌లో గురువారం ‘అంత సీన్ ఉందా?’ శీర్షికన వెలువడిన కథనంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వానికి అంత సీన్ ఉందా? అంటే ఉందని చెబుతానని ముఖ్యమంత్రి నవ్వుతూ సమాధానం చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలల్లో పార్టీ తరఫున ఇ-క్యాంపెయిన్ ప్రచారానికి శ్రీకారం చుడుతూ తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి మీడియాతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రభూమిలో ప్రచురితమైన కథనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి తమ ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన నిధులను ఎక్కడి నుంచి సమీకరించేది వివరించారు. దేశంలో పెద్ద నగరాల సమగ్ర అభివృద్ధికి ఏటా కనీసం పది, పదిహేను వేల కోట్ల నిధులు కావాలని ప్రధాన మంత్రిని ఇప్పటికే కోరుతూ లేఖ రాశానని తెలిపారు. తన లేఖపై ప్రధాన మంత్రి స్పందిస్తూ వచ్చే బడ్జెట్‌లో తప్పకుండా నిధులు కేటాయించనున్నట్టు హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కూడా ఈ సారి 15 శాతం వృద్ధి కనిపిస్తుందన్నారు. వీటికి తోడు ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ పథకాల ద్వారా వచ్చే నిధులను, నగరంలో ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా వచ్చే నిధులను కూడా హైదరాబాద్ అభివృద్ధికే ఖర్చు పెట్టబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు నీటి సరఫరా చేయడానికి రూ.2500 కోట్ల రుణాన్ని హాడ్కో ఇచ్చిందని, అలాగే మరో రూ.7000 కోట్ల రుణం ఇవ్వడానికి ఇతర ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో ఇప్పటికే రూ. 9000 కోట్లు సమకూరాయని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా తీర్చడానికి బ్రిక్స్ సంస్థ రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ నిధులన్నింటినీ సమకూర్చుకోగలిగితే హైదరాబాద్ నగరాభివృద్ధి అవసరమైన రూ.30 వేల కోట్లు ఖర్చు పెట్టడం తమకు పెద్ద సమస్యేమి కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

చిత్రం...
తెలంగాణ భవన్‌లో గురువారం ఆంధ్రభూమి
దిన పత్రికలో వచ్చిన కథనాన్ని చూపిస్తున్న సిఎ కెసిఆర్