విజయవాడ

కమిషనరేట్ పరిధిలో ‘కరోనా’ ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 22: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావంతో నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో తీవ్ర ఆంక్షలు విధించారు. నగరంలోని ఓ యువకుడికి కరోనా వైరస్ సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నగరంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరింత ఆందోళన ప్రజల్లో నెలకొంది. కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రధాని పిలుపు మేరకు ఒకరోజు జనతా కరోనాకు కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. మరోవైపు డీజీపీ నిర్ణయం మేరకు ఏప్రిల్ 14వ తేదీ వరకు నగరంలో 144సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. నగరంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకిన యువకునికి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని చెబుతున్నా వారికి పరీక్షలు అవసరమన్నారు. వారి కుటుంబ సభ్యులు బయటకు వస్తే వైరస్ విస్తరించే అవకాశం ఎక్కువ అన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని, నగరంలో కరోనా కంట్రోల్ రూము నెంబర్ 7995244260 నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కరోనాపై ఫిర్యాదులు చేయవచ్చని సీపీ తెలిపారు.
చప్పట్లుకొట్టి ధన్యవాదాలు
ఇదిలావుండగా ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అమలు చేసిన జనతా కర్ఫ్యూ కమిషనరేట్ పరిధిలో విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ పాటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సాయంత్రం 5 గంటలకు యాతవ్ భారత ప్రజానీకం ఇంటి బయట నిలబడి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోఢీ పిలుపు మేరకు పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, అదనపు పోలీసు కమిషనర్ బి శ్రీనివాసులు పోలీసు కమిషనరేట్ కార్యాలయపు ఆవరణలో అధికారులు, సిబ్బంది బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు. కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీపీలు విక్రాంత్ పాటిల్, హర్షవర్ధన్ రాజు, క్రైం డీసీపీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ డీసీపీ టివి నాగరాజు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.