విజయవాడ

‘డయల్ యువర్ జేసీ’లో పలు సమస్యలకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: రైతుల ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొనే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం నిర్వహించిన డయల్ యువర్ జాయింట్ కలెక్టర్ కార్యక్రమంలో రైతుల నుంచి పలు సమస్యలను స్వీకరించడమే కాకుండా తక్షణ పరిష్కారం చూపారు. పెదపారుపూడి నుంచి పొలుకొండలోని విజయలక్ష్మీ రైస్‌మిల్లుకు పంపించిన ధాన్యంనకు సంబంధించిన రైతు తనకు నగదు జమ కాలేదని ఫిర్యాదు చేయగా, ఆ మిల్లుకు టార్గెట్ లేనందున వెంటనే దానికి టార్గెట్ ఇచ్చి నగదు జమ కొరకు చర్యలు తీసుకున్నారు. జీ కొండూరు మండలం నుంచి ఎం సాంబశివరావు, వెంటప్రగడ నుంచి వీఆర్‌కే శ్రీనివాసరావు, జగ్గయ్యపేట నుంచి కే సతీష్, తదితరులు కూడా తమకు నగదు జమ కాలేదని తెలపడంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ అందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాలో జమ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఖరీఫ్ పంట కాలంలో ఇప్పటివరకూ 267 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 75,567 రైతుల నుంచి 1141.55 కోట్ల విలువైన 6,23,566 ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. టార్గెట్‌తో సంబంధం లేకుండా మార్చి 15నాటికి జిల్లాలోని రైతుల వద్ద ఉన్న ధాన్యం కనీస మద్దతు ధరకు ఏ రకమైన ధాన్యమైన కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు, నాగాయలంక, అవనిగడ్డ, మండలంలోని రైతుల నుంచి బీపీటీ రకం ధాన్యం కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న వరి రైతులందరికీ వారు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈవిషయంపై రైతులు ఆందోళన పడవద్దన్నారు. రైతులు తమ సమీపంలోని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యం విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు.

మహిళలు తమ సమస్యలు
తామే పరిష్కరించుకోగలగాలి
*సీపీ ద్వారకా తిరుమలరావు *‘మహిళా మిత్ర’తో సమావేశం
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 19: మహిళలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలిగే స్థాయికి రావాలని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. కమాండ్ కంట్రోల్‌లో బుధవారం సాయంత్రం జరిగిన మహిళా మిత్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించడం కోసం ప్రతి పోలీస్టేషన్ పరిధిలో మహిళా మిత్ర కార్యక్రమం ఏర్పాటు చేసి ఇందులో భాగంగా ప్రతి నెలా పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబల్, హెడ్ కానిస్టేబుల్‌తో ఇద్దరు మహిళా మిత్ర సభ్యులు, మహిళా కో-ఆర్డినేటర్స్‌తో పోలీస్ స్టేషన్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో, కమిషనరేట్ స్థాయిలో మీటింగ్‌లు నిర్వహించి కొత్తగా ఏర్పడే సమస్యలను ఏవిధంగా ఎదుర్కోవాలి, సైబర్ నేరాలకు పాల్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యల గూర్చి, నూతనంగా ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన దిశ యాప్ గూర్చి అవగాహన కలిగించాలన్నారు. దీనిలో భాగంగానే మహిళా మిత్ర సభ్యులు, మహిళా మిత్ర కో-ఆర్డినేటర్స్, మానసిక వైద్య నిపుణులు, మెడికల్ డాక్టర్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందని, ఈకార్యక్రమం ప్రతి నెలా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో దిశ వన్‌స్టాప్ సెంటర్ ఎస్‌ఐ శ్రావణి, కంట్రోల్ రూము సీఐ కాశీవిశ్వనాథ్, సైబర్ క్రైం స్టేషన్ సీఐ కే శివాజీ, మహిళా పోలీస్టేషన్ ఏసీపీ వీవీ నాయుడు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణకుమారి, వాసవ్య మహిళా మండలి కార్యదర్వి రష్మీ, ఏపీ టెక్‌టవర్ ప్రతినిధులతోపాటు అదనపు పోలీసు కమిషనర్ బీ శ్రీనివాసులు, డీసీపీలు విక్రాంత్ పాటిల్, హర్షవర్ధన్‌రాజు, మహిళా మిత్ర సభ్యురాలు దుర్గాదేవి, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.