విజయవాడ

శివరాత్రికి ముస్తాబవుతున్న ప్రభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఫిబ్రవరి 17: ప్రతి ఏ డాది లాగానే ఈ ఏడాది కూడా శివరాత్రికి యనమలకుదురు కొండపై వేంచేసిన శ్రీరామలింగేశ్వర స్వామి ఆల యం నందు శివపార్వతి కల్యాణోత్సవానికి భారీగా వేడుకలను నిర్వహించేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుం డా సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు మంచినీళ్లు, క్యూలైన్లు, వారి పరిరక్షణకు సిబ్బంది ఏర్పాటు వంటి విషయాల్లో నిర్వాహకులు ప్రగడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేశారు. కిందనుండి కొండ మీదకు వెళ్లి స్వామిని దర్శించుకునే వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక ఏర్పా టు చేస్తున్నారు. వారికి ఉచిత వాహనా న్ని దేవాలయ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్ర త్యేక ఏర్పాటు చేస్తూ భక్తులకు ఇబ్బం ది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంగా నరసింహరావు పేర్కొన్నారు.
కల్యాణోత్సవం అనంతరం ఊ రంతా ఉత్సవ విగ్రహాల ఊరేగింపున కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి రోజున సుమారు 10లక్షల మంది భక్తులు స్వామి దర్శనానికి వ చ్చే అవకాశం ఉందని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. దీంతో మహాశివరాత్రి వేడుకలను భారీగా అధికారులు, కమి టీ సభ్యులు ఒక మహాయజ్ఞంగా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చే శారు. భక్త బృందాలు ఆధ్వర్యంలో 55ప్రభలను ఊరేగింపులో పాల్గొనడానికి పరిష్మన్లు తీసుకున్నారు. ఉత్సవాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయాలని కోరుతూ దేవదా య ధర్మదాయ శాఖ అధికారులు, పో లీసులుశాఖ కృషి చేస్తున్నాయి. లక్షలా ది రూపాయలతో ఈ ఏడాది ప్రభలు విద్యుత్ అలంకరణతోను, పలు రకాల ఆకర్షణలతోను, అందరినీ ఆకర్షించేలా ప్రభలను సిద్ధం చేస్తున్నారు.

దుర్గమ్మ సేవలో మంత్రి శంకర నారాయణ
విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 17: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి సేవలో ఏపీ రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి ఎం శంకర నారాయ ణ పాల్గొన్నారు. దుర్గమ్మ ఆలయానికి సోమవారం వచ్చిన మంత్రి శంకర నా రాయణకు అధికారులు ఆలయ మ ర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారాయణ పూజలను నిర్వహించారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు. అధికారులు మంత్రికి ప్రసాదాలు, శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.