విజయవాడ

భోజనాలు సరే.. తినడానికి కంచాలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 17: అంగట్లో అన్నీ ఉన్నా తినడానికి కంచా లు వేవన్న సామెత ఉప్పలపాటి రామచంద్రరాజు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు సరి గ్గా సరిపోతుంది. గట్టు వెనుక సితార సెంటర్‌లోని లేబర్ కాలనీలోని ప్రభు త్వ పాఠశాల దుస్థితి ఇది. మధ్యాహ్నం భోజనం కోసం విద్యార్థినీ, విద్యార్థులు తమ వంతు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వందలాది మంది పిల్లలు భోజనం చేయడానికి కంచాలు లేక త మ వంతు కోసం ఎదురుచూడాల్సి వ స్తుంది. హైస్కూల్ విభాగంలో విద్యార్థి నీ, విద్యార్థులు 430 మంది ఉండగా కంచాలు మాత్రం కేవలం 200 మా త్రమే ఉన్నాయి. అలాగే అదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలల్లో 300 మంది విద్యార్థినీ, విద్యార్థులుండగా వారందరికీ కలిపి కేవలం 100 కంచా లు ఉన్నాయి. తొలుత కొంత మంది భోజనాలు చేసిన తరువాత ఆ కంచా లు శుభ్రం చేసుకుని మిగతావారు తి నాల్సి వస్తోంది. హైస్కూలు, ఎలిమెంట రీ స్కూల్‌లో మొత్తం 730 మందికిగా ను 300 కంచాలే ఉన్నాయి. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయులు జీవీ శ్రీనివాసరావుని వివరణ కోరగా కంచా లు కొరత ఉన్న మాట వాస్తవమేనని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చి న్నారుల ఇబ్బందులు తొలగిస్తారేమోన ని దాతలకోసం వెతుకుతున్నానన్నారు.
మధ్యాహ్న భోజనాలు భేష్
ఐతే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజ నం నూతన మెనూ విధానం మాత్రం బాగుందని, అన్నం, కూరలు రు చికరంగా ఉంటున్నాయని విద్యార్థులు తెలిపారు. గత ప్రభుత్వం అందించిన బియ్యం అన్నంలో ముక్కు పురుగులు, అన్నం చిమిడిపోయి మింగుడు పడేది కాదని ప్రభుత్వం మారాక కూర లు నిబంధన మేర వండుతున్నారని, గుడ్డుఉడికించి ఇస్తున్నారన్నారు. కూర, చారు రుచిగా తయారు చేస్తున్నారని అన్నంతో పాటు ముందుగా వేరుశనగ పప్పు బెల్లంతో తయారు చేయించిన పప్పు చెక్కను అందిస్తున్నారు.

భక్తులకు అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు
కంకిపాడు, ఫిభ్రవరి 17: మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీపీ సురేంద్రరెడ్డి అ న్నారు. మండలంలోని మద్దూరు గ్రా మం కరకట్ట వెంబడి ప్రవహిస్తున్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో శివరాత్రిని సందర్భంగా భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఏసీపీ సురేంద్ర, సీఐ శివాజీ, ఎస్‌ఐ షరీఫ్ నదీ పరివాహక ప్రాంతా న్ని పరిశీలించి, లోతు వివరాలు తెలుసుకుని గజ ఈతగాళ్లను, బోట్లను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి చింతా కిరణ్‌కుమార్‌ని కోరారు.