విజయవాడ

ఇసుక అమ్ముకుంటున్న ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, నవంబర్ 11: భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటంబాలు రోడ్డున పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిదుర పోతోందని పెనమలూరు మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. టీడీపీ హయాంలో ట్రక్కు ఇసుక రూ. 1000 నుంచి 1500లకే నిరంతరం అందుబాటులో ఉంటే ఇప్పుడు కొనలేని స్థితిలో రూ. 8వేల నుంచి 10వేలకు అదీ అరకొరగా లభ్యవౌతోందన్నారు. రొయ్యూరు ఇసుక క్వారీలో పామర్రు, పెనమలూరు ఎమ్మెల్యేలు అధిక ధరలకు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని బోడే ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దీనిపై ఫిర్యాదులు చేస్తుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. వరదల కారణంగానే ఇసుక అందుబాటలో లేదని కుంటిసాకులు చెబుతున్న ప్రభుత్వం రబ్బీషు క్వారీలను ఎందుకు మూసేసిందని ఆయన నిలదీశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అసంబద్ధ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 14న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నాలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని బోడే ప్రసాద్ కోరారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సుధిమళ్ల రవీంద్ర, పార్టీ నాయకులు అనుమోలు ప్రభాకర్, అనే్న ధనయ్య, మద్దాలి సాయిబాబు, అనే్న రామారావు, చలువాది రాజా, విక్రమ్, నాంచారయ్య, స్టాలిన్, చీలి సురేంద్ర, శ్రీకాంత్, బాజీ పాల్గొన్నారు.

పైప్‌లైన్ ప్రాజెక్టుకు రైతులను ఒప్పించండి
* తహశీల్దార్లు, అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశం
విజయవాడ (క్రైం), నవంబర్ 11: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన విజయవాడ - ధర్మపురి పైప్‌లైన్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరిగేందుకు రైతులను ఒప్పించే చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తహశీల్దార్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సీఆర్డీఏ పరిధిలోని మండలాలు, జి కొండూరు, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో 55కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ ఏర్పాటుకు 201 ఎకరాలు అవసరం అవుతాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి భూమి నష్టపరిహారం చెల్లింపు విషయంలో ఏర్పడిన పలు ఆటంకాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం నిర్థారించిన భూమి పరిహారం తీసుకునే విషయంలో సంబంధిత రైతులను సంప్రదించి సమ్మతి తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, సబ్ కలెక్టర్లు హెచ్‌ఎం ధ్యానచంద్ర, స్వప్నిల్ దినకర్ ఫుండకర్, హెచ్‌పీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.