విజయవాడ

టీడీపీ ర్యాలీకి అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 23: నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందునే తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులను అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. నగరంలో పార్టీ నాయకులు తలపెట్టిన ర్యాలీకి అనుమతి లేదని, అందువల్లే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తు చర్యగా అరెస్టు చేసి, విడుదల చేసినట్లు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జే శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు నగరంలో ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీనగర్ న్యూ ఇండియా సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. ఇదే సమయంలో మరికొందరు కార్యకర్తలు జింఖానా గ్రౌండు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ర్యాలీగా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసు బలగాలు ర్యాలీకి అనుమతి లేదని, నిలిపివేయాలని సూచించారు. ఇందుకు నిరాకరించిన టీడీపీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం కావడంతో పోలీసులకు, కార్యకర్తలు, నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో గంటల పాటు ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు టీడీపీ కార్యకర్తలు, నాయకులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసు చర్యలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావుపై ఘాటు విమర్శలు గుప్పించారు. సత్యనారాయణపురం, గవర్నర్‌పేట పోలీసులు భారీగా మోహరించి టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసం మునయ్య, నందిగం ఆశీర్వాదం, వై ఏసురత్నం, సందెపోగు శామ్యూల్, చింకా విజయ్, బత్తుల శ్రీనివాసరావు, కొలకలూరి రవి, తదితరులు 25 మందిని ముందస్తు చర్యగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పరిస్థితి సద్దుమణిగాక సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఇదిలావుండగా ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి వాక్‌స్వాతంత్య్రం ఉంటుందని, బహిరంగ సభలు, సమావేశాలు, నిరసనలు, ర్యాలీలు జరపడం ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని, అయితే చట్ట పరిధిలో ప్రజలకు అసౌకర్యం లేకుండా కార్యక్రమం చేసుకోవాలని, ఇందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం ఉంటుందని పోలీసు కమిషనరేట్ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో పాటు కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 144, సెక్షన్-30 పోలీసు యాక్టు కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు. ధర్నాచౌక్‌లో ధర్నాకు అనుమతి ఇచ్చారని, అయితే నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందున చట్టపరిధిలో పోలీసులు వ్యవహరించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.