విజయవాడ

నిదానంగా వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 17: కృష్ణానది వరద శుక్రవారం అర్ధరాత్రి దాటాక లోతట్టు ప్రాంతవాసులను హడలెత్తించింది. శుక్రవారం రాత్రి 7.60 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం క్రమేణా పెరుగుతూ బ్యారేజీ వద్ద నీటిమట్టం 18 అడుగులకు చేరింది. ఎగువ నుండి 8లక్షల 5వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. దాంతో కుమ్మరిపాలెం హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివాసాలకు వరద నీరు ఎగబాకింది. రానురాను పెరుగుతుందనే భయంతో ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు. అయితే గంటల వ్యవధిలో నీరు తగ్గుముఖం పట్టడంతో హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులూ అప్రమత్తమయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, వీఎంసీ అధికారులు అందరూ విపత్తును ఎదుర్కోడానికి సంసిద్ధమయ్యారు. అయితే క్రమేణా వరద ఉద్ధృతి తగ్గింది. శనివారం మధ్యాహ్నానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 17.8 అడుగులకు తగ్గింది. 7.76 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదిలారు. శనివారం ఉదయం నుండి రాత్రి వరకు సందర్శకులు బ్యారేజీ వద్ద సందడి సందడిగా గడిపారు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు పాదచారులను పోలీసులు అనుమతించలేదు. కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే వదిలారు. శుక్రవారం నుండే బ్యారేజీపై భారీ వాహనాలు, ఆటోలు, కార్ల రాకపోకలు నిషేధించిన విషయం విదితమే. శనివారం సందర్శకులను బ్యారేజీపైకి అనుమతించారు. దాంతో బ్యారేజీపై సందర్శకులు పోటెత్తారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు నానాతంటాలు పడాల్సి వచ్చింది.