విజయవాడ

వరద ముంపు ప్రాంతాల్లో నాటు పడవలు వినియోగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 17: వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు నాటు పడవలను వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శనివారం వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలపై మండల ప్రత్యేకాధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సుశిక్షుతులైన సిబ్బందితో అధునాతనమైన బోట్లు జిల్లా యంత్రాంగం వినియోగిస్తోందని, అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు నాటు పడవలు వినియోగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని చెప్పారు. వీటివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. వరద ముంపునకు గురైన అన్ని ప్రాంతాల్లో బోట్లు సిద్ధంగా ఉంచామని, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన బోట్లు మాత్రమే ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలెవ్వరూ నాటు పడవలు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఘంటసాల, చల్లపల్లి, మోపీదేవి, తదితర ప్రాంతాలలో బోట్లు సిద్ధంగా ఉంచామని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ అంశాలను ఛాలెంజ్‌గా తీసుకుని ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వరద తగ్గిన వెంటనే గంటల వ్యవధిలో పూర్తిస్థాయి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, నీటి వనరుల్లో క్లోరినేషన్ చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా మలాథియాన్ చల్లించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు నాణ్యమైన భోజనం, పిల్లలకు పాలు అందించాలన్నారు. వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసర మందులన్నింటినీ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో వరద ముంపునకు గురైన మండలాల్లో పాముల బెడద ఎక్కువగా ఉన్నందున యాంటీ స్నేక్ వీనమ్‌ను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.
ముంపు ప్రాంతవాసులు
సురక్షిత ప్రాంతాలకు రావాలి
* కలెక్టర్ ఇంతియాజ్ సూచన * పడవలో పర్యటన * బాధితులకు పరామర్శ
విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 17: నగరంలోని రామలింగేశ్వరనగర్, ఆళ్ళ చల్లారావు వీధి, తదితర వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులతో కలిసి పర్యటించారు. పడవపై ప్రయాణించి ‘మీకు అండగా మేమున్నాం’ అంటూ వరద బాధితులకు మనోధైర్యమిచ్చారు. వరద ఉద్ధృతి కారణంగా రామలింగేశ్వరనగర్, ఆళ్ళ చల్లారావు వీధి ప్రాంతాల్లో ఏటిగట్టున నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు రావాలని కలెక్టర్ కోరారు. ఈ ప్రాంతంలో సుమారు 200 కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయని, పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరినప్పటికీ ఇంకా కొందరు అక్కడే ఉండిపోయి వరద ముంపులో చిక్కుకున్నారన్నారు. వరద ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికీ ముంపులో చిక్కుకున్న వారిని ఇళ్లల్లోంచి బయటకు రప్పించి పడవలపై పునరావాస కేంద్రాలకు తరలించే కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. పడవపై మైకు ద్వారా వరద బాధితులకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సురక్షిత ప్రాంతానికి రావాలని కోరారు. మరో ఆరు పడవలు రప్పిస్తున్నామని విపత్తుల నివారణ, అగ్నిమాపక శాఖ ద్వారా అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తున్నామని, కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఇళ్లకు రక్షణగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ఎలాంటి భయాందోళనలు చెందకుండా తక్షణం పునరావాస కేంద్రాలకు రావాలన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే ఆయా ప్రాంతాలను పారిశుద్ధ్య పనులతో మెరుగుపరుస్తామని కలెక్టర్ ఇంతియాజ్ భరోసా ఇచ్చారు. సహాయ కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ కే మాధవీలత, సబ్ కలెక్టర్ మిషాసింగ్, పలువురు నగరపాలక శాఖాధికారులు, అగ్నిమాపక శాఖాధికారులు, వార్డు వలంటీర్లు పాల్గొన్నారు.