విజయవాడ

సురక్షిత ప్రాంతాలకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం)/ పెనమలూరు, ఆగస్టు 17: వరద తాకిడికి గురైన కృష్ణానది పరివాహక ప్రాంతాలైన లోతట్టు కాలనీలు, గ్రామాలను పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు శనివారం సందర్శించారు. ఇక్కడి ప్రజలకు అందుతున్న వరద సహాయక పునరావాస చర్యలు గూర్చి ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా పోలీసు, రెవెన్యూ శాఖల సహాయక చర్యలను పరిశీలించారు. పోలీసు సిబ్బందిని మరింత అప్రమత్తం చేసి ముంపు ప్రాంత ప్రజలకు కావాల్సిన మరిన్ని సహాయక సహకారాలు పోలీసుశాఖ తరుఫున అందించేందుకు బాధిత కుటుంబాలను కలిసి అడిగి తెలుసుకున్నారు. కృష్ణలంక నుంచి తోట్లవల్లూరు వరకు కృష్ణానది వెంబడి ఉన్న భూపేష్‌గుప్తానగర్, రాణిగారితోట, గీతానగర్, రామలింగేశ్వరనగర్, పెదపులిపాక, చోడవరం, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు తదితర ప్రాంతాలను, గ్రామాలను సందర్శించారు. కృష్ణానది లంక గ్రామమైన పాముల్లంకను పడవలో వెళ్లి సందర్శించి అక్కడి ప్రజలతో పరిస్ధితిని వివరించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వల్లూరుపాలెం, తోట్లవల్లూరు గ్రామాల్లోని వరద సహాయక కేంద్రాలు, పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. తోట్లవల్లూరు పోలీస్టేషన్‌ను సందర్శించి అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేసి వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, అలక్ష్యం వద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు హర్షవర్థనరాజు, డీ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏడీసీపీ నాగరాజు, స్పెషల్ బ్రాంచి ఏడీసీపీ నవాబ్ జాన్, ఎస్‌బీ ఏసీపీ జీ రాజీవ్‌కుమార్, ఏసీపీలు, పెనమలూరు సీఐ సత్యనారాయణ, తహసీల్దారు భద్రునాయక్, ఎంపీడీవో జే విమాదేవి, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, ప్రజారోగ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.