విజయవాడ

తొలిరోజు నామినేషన్లు నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 18: సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం సోమవారం ప్రారంభం కాగా, తొలిరోజు సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలకు ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు. నగరంలోని నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెల్ కార్యాలయాలను ఏర్పాటు చేయగా, సెంట్రల్ నియోజకవర్గానికి వీఎంసీ కమిషనర్ ఎం రామారావు, తూర్పు నియోజకవర్గానికి జిల్లా నీటి నిర్వహణ సంస్థ పీడీ సీ గురుప్రకాశరావు రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా 18న సోమవారం నుంచి 25న సోమవారం వరకూ ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణకు సమయం కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీలకు అభ్యర్థులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కొంత మంది మాత్రం నామినేషన్ల పత్రాలను అధికారుల వద్ద నుంచి తీసుకెళ్లారు. తొలి రోజు సరైన ముహూర్తం కాదనో, తమ జాతకం ప్రకారం సరిపోదనోనన్న విషయాలపై అభ్యర్థులు తమ నామినేషన్ వేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా 23, 24న శని, ఆదివారాలు కావడంతో ఆయా తేదీలలో నామినేషన్ల స్వీకరణ ఉండదు. మళ్లీ 25న చివరి రోజు కావడమే కాకుండా ఆదే రోజు ముహూర్త బలం కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుండటంతో ఆ రోజు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టు వినికిడి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పూరించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన పద్ధతులను వివరించేందుకు గాను హెల్ప్ డెస్కులను ఏర్పాటుచేయడంతో అభ్యర్థులకు కొన్ని కష్టాలు తీరినట్టున్నాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులో చేర్చవలసిన అంశాలలో ప్రధానంగా కోర్టు కేసులు, ఆస్తుల వివరాలు, ఆదాయం తదితర అంశాలుండగా, పోటీలో ఉండే వారు తమ ఆదాయ వ్యయాలపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా అభ్యర్థులు తెలిపిన వివరాలలో వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.28లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.70లక్షల వ్యయ పరిమితిని నిర్ణయించారు. ఎవ్వరైనా ఈ పరిమితికి లోబడి మాత్రమే వ్యయం చేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలైన నాటి నుంచి జరిగే ప్రచార వ్యయాన్ని అభ్యర్థికి వర్తిస్తుండగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన మార్చి 10నుంచి జరిగిన ప్రచార కార్యక్రమాల వ్యయాన్ని పార్టీకి వర్తిస్తుందని అధికారులు తెలుపుతుండగా, నామినేషన్‌కు ముందే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఖర్చు కూడా అభ్యర్థికే వర్తిస్తుందంటూ మరికొంత మంది అధికారులు పేర్కొంటుండగా, ఈవిషయంలో సరైన క్లారిటీ కోసం ఉన్నతాధికారుల సమాచారం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. అలాగే రోజువారీ వ్యయంపై ఎన్నికల అధికారులు కూడా స్వయంగా పరిశీలన చేయనున్నారు. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్ర ప్రచారాలు, అభ్యర్థుల ప్రచారంతోపాటు వారి తరఫున ఇతరులు, ప్రముఖులు చేసే ప్రచార వ్యయాలపై నిఘా నేత్రం పనిచేస్తుంది. మినిట్ టు మినిట్ వీడియో చిత్రీకరణ చేసి వ్యయ పరిశీలన చేయనున్నారు. అలాగే ప్రచారంలో వినియోగించే జెండాలు, కరపత్రాలే కాకుండా వాహనాల వినియోగంపై కూడా వ్యయ పరిశీలన చేయనున్నారు. ఎన్నికల వ్యయాలపై అడిగే ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదు. ఒక సభకు జరిగే వ్యయాన్ని ఎలా లెక్కిస్తారు, అభ్యర్థుల లెక్కకు, అధికారుల లెక్కకు తేడా వస్తే చివర్లో సాంకేతిక ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని కూడా అభ్యర్థి వ్యయానికే వర్తింపజేస్తామంటున్న అధికారులు, ఏ విధంగా లెక్కిస్తారు, ఎంతెంత నిర్ణయిస్తారన్న విషయంపై సరైన క్లారిటీ లేదు. కాటన్, సిల్క్ క్లాత్ జెండాలు, జెండా కర్రలపై సరైన స్పష్టత లేదు. ఇలా చెప్పుకుంటుపోతే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో సరైన సమాధానం కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, మార్చి 10నుంచి జరిగిన ఖర్చు అభ్యర్థి వ్యయం కిందకే వర్తిస్తే ప్రధాన పార్టీల అభ్యర్థులకు వ్యయ కష్టాలు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ విషయాలపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.