విజయవాడ

వరల్డ్ కప్ స్టేజ్-1, 3కి జ్యోతిసురేఖ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 18: నగరానికి చెందిన అంతర్జాతీయ ఆర్చర్, అర్జున అవార్డి వీ జ్యోతిసురేఖ కొలంబియాలో జరగనున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1కు, టర్కీలో జరుగనున్న వరల్ట్‌కప్ స్టేజ్-3కు, నెథర్లాండ్‌లో జరగనున్న సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. భువనేశ్వర్‌లో ఈనెల 16నుండి 18వరకు జరిగిన ఎంపికల్లో భారతజట్టుకు జ్యోతిసురేఖ ఎంపికైంది. ఆర్చరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తూ జ్యోతి దూసుకుపోతోంది.
కోలవెన్నులో రెండు పూరిళ్లు దగ్ధం
కంకిపాడు, మార్చి 18: అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమైన సంఘటన కోలవెన్నులో సోమవారం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియలేదు. సేకరించిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన యేకల గౌరి, కాకి పైడిమ్మల తల్లీకూతుళ్లు. వీరు స్థానిక వినాయక మండపాల దగ్గరలో నివాసం ఉంటున్నారు. తల్లి పైడమ్మ కూలి పనికి వెళ్లగా ఆరోగ్యం బాగోలేదని గౌరి మందుబిళ్లలు వేసుకుని పడుకుంది. అదే సమయంలో పూరిళ్లకు మంటలు అంటుకున్నాయి. వేడి సెగలు రావటంతో ఉలిక్కిపడి లేచిన గౌరి ప్రమాదాన్ని పసిగట్టింది. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలెండర్‌ను అతికష్టం మీద బయటకు లాగింది. సామగ్రిని కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. కళ్లెదుటే రెండు పూరిళ్లు కాలిబుడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఉయ్యూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఇంట్లోని వంట సామగ్రి, విలువైన వస్తువులు, బంగారు, వెండి అభరణలు రూ.70వేలు నగదు మంటల్లో కాలిపోయాయి. సర్వం మంటల్లో కాలిపోవటంతో బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎస్ షరీఫ్ ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నాయకులు తుమ్మల జగదీష్, కంచర్ల వీరాంజనేయులు, వైసీపీ నాయకులు కొలుసు పార్థసారథి, తుమ్మల చంద్రశేఖర్, నక్కా శ్రీనివాస్ బాధితులను పరామర్శించారు. తమవంతు ఆర్థిక సాయం అందించి రెవెన్యూపరంగా బాధితులకు సాయం అందించాలని సంబంధిత అధికారులను కోరారు.