Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
జయ: అయితే పాత వాసనలున్న నేను కూడా నీదారికి రాందే సినిమా తీయలేనంటావ్. మరైతే అర్జంటుగా రచయితను చూడు.
ఏ.వి.: ఓ రచయితను చూశాను. అతనేమన్నాడో తెలుసా?
జయ: ఏమన్నాండేంటి?
ఏ.వి.: తాడూ, బొంగరం లేని మీలాంటి కొత్తవాళ్లకు కథరాస్తే నా కథ సునామీలో కొట్టుకుపోతుంది. నేను ఏ బినామీ కంపెనీల వాల్లకో జమాఖర్చులు వ్రాస్తూ బతకాల్సి వస్తుంది అన్నాడు.
జయ: అయితే నీ ఉద్దేశం నేను ఆటైపనా? వేళాపాళా లేకుంటా కాఫీలు తాగి తాగీ, టివీలు సినిమాలు చూసీ చూసీ ఇంగ్లీషు నవల్సును తిరగేసి నకబడ్డ రచయితనల్లా ఊదరగొట్టి వాళ్ల ఆలోచనలన్నీ అయస్కాంతంలా లాగేసుకుని ఏదో ఒక తుక్కుముక్కను కథంటూ పట్టుకొచ్చి నాలాంటి వాళ్లకు సలహాదారుడిగా తిరుగుతుంటావ్.
ఏ.వి.: నీ పైసా ఖర్చుకాకుండా సినిమా తియ్యాలని డబ్బు పెట్టే పార్టీల కోసం పార్కులోనూ, బీచ్‌లలోనూ , బార్లలోనూ , కార్లలోనూ, పబ్ లలోనూ తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటావ్ పైగా ఏదో మహత్తరమైన కథతో సినిమా తీసేవాడిలా తపస్విలా నటిస్తుంటావా ఏం రాకపోయినా..
జయ ; అపాపు. ఎవరైనా వింటే నిజమనుకోనేరు.
ఏ.వి.: నిన్ను గురించి నేనూ, నన్ను గురించి నీవు ఎన్ననుకున్నా! అనుకున్న పని అవడం ముఖ్యం. అపుడు మనం ప్రాణ స్నేహితులమని అందరికీ తెలుస్తుంది. ఎవరేమనుకున్నా విలువల్ని కాలదన్ని ఈకాలంనికి తగినట్లుగా సినిమాలు తీయడం మన వల్ల కాదు.
సెనక్కా: సెనక్కాయలండీ సెనక్కాయలు..
జయ: ఇప్పటిదాకా మన మాటలన్నీ విని ఇప్పుడే ఇక్కణ్ణుంచి వెళ్తున్నాడే సెనక్కాయలవాడు! అందుకే నవ్వుకుంటూ అటువైపు వెళ్తున్నాడు. వాడిక్కూడా మన సినిమా నవ్వులాటా వున్నట్లుంది.

(ఇంకా ఉంది)

హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.