Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
- షణ్ముఖశ్రీ - 8897853339
*
జయ: కొత్తదనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆ ! అటు చూడు సెనక్కాయలవాడు వస్తున్నాడు. సెనక్కాయలు తింటూ కథా చర్చ మొదలుపెడదాం.
సెనక్కాయలవాడు: సెనక్కాయలండీ! సెనక్కాయలు!
వీరిద్దరూ సెనక్కాయలు తీసుకొని తింటుంటారు.
ఏ.వి.: వీడ్నీ మధ్య ఎప్పుడూ ఇక్కడ చూడలేదే! సెనక్కాయలు బాగానే ఉన్నాయ్
జయ: ముందు మనకథ ఆరంభించు కథ బాగా లేకపోతే
ఏ.వి.: సెనక్కాయలు తొక్కల్ని విసిరి పారేసినట్లు మనల్ని అందరూ విసిరి పడేస్తారు.
ఏ.వి.: ఆ విషయం పక్కన బెట్టు. అటు చూడు. మన ఎదురుబెంచీ దగ్గర. ఆ యువకుణ్ణి చూడు. ఇందాకటి నుంచి ఎవరి కోసమో ఎదురుచూస్తూ టెన్షన్ పడుతున్నాడు. చాలా బాగున్నాడు కదూ.
జయ: బాగుండడమేమిటి ? అతనొప్పుకుంటే అతణ్ణే హీరోని కూడా చేయొచ్చు.
ఏ.వి.: హీరో దొరకితే చాలా ! కథ అక్కర్లేదా?
జయ: అవునవును, నిజమే. ముందు కథ కానీయ్యి
ఏ.వి.: కథఅంతే నేను కథ చెప్పడం అయిపోయింది.
జయ: చివరికేవౌతుందో చెప్పకుండానే కథ అయిపోయిందంటావేంటి?
ఏ.వి.: చివరికేవౌతుందో, మధ్యల ఏమవుతుందో, మనం పెట్టబఓయే రచయిత, దర్శకుడు,మన కథను పీకి పాకం పట్టి మనకు రాస్తారు. అప్పటిదాకా మనం జుట్టు పీక్కుంటూ వాళ్లను మేపుతూ పిక్‌నిక్‌లను తీసుకెళ్తుండడమే.
ఏ.వి.: అందుకని ముందుగా ఓ రచయితను సంప్రదించాలి.
జయ: వెనకటి వాళ్లంతా ఖత పూర్తయ్యా కనే నటీ నటుల్ని అనే్వషించే వాళ్లు నాకా పద్ధతే ఇష్టం.
ఏ.వి.: ఏడిసినట్లుంది. అలా అయితే ఈరోజుల్లో మనం సినిమా తీసినట్లే. కథ దారిన కథ నడుస్తుంటుంది. మన దారిన మనం నటీ నటుల్ని బుక్ చేసుకొని షూటింగ్ లాగించేస్తుంటాం. రచయిత కథ రాస్తూనే ఉంటాడు. దర్శకుడు తన కళారాధనలో తపించిపోతూ సినిమా తీస్తూనే ఉంటాడు. మనం డబ్బు డ్రా చేస్తూనే ఉంటాం. ఇదే ఈనాటి కొత్తదనం.
*
(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.