Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఘ్నేశ్వరుని విడాకులు
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
విఘ్నే; ఏముంది మీవారు మరో పిల్లతో కాపురం చేస్తున్న సంగతి మీకు తెల్సిపోయింది.
మీన: నేను మిమ్మల్ని ప్రశ్నించానే కానీ అలా అని నేనేమీ చెప్పలేదే.
విఘ్నే: అయితే మీది అన్యోన్య దాంపత్యం అన్నమాట.
మీన; ఏం దాంపత్యంలేండి
విఘ్నే: ఏవిటమ్మా! అలా పథ్యం చేసిన మనిషిలా అయిపోయావ్
మీన: మీరు సత్యం గ్రహించలేకపోయారని
విఘ్నే: ఏం చేస్తుంటారాయన
మీన: క్యాంపులంటూ ఊళ్లు తిరుగుతుంటారు
విఘ్నే: పెళ్లికి ముందు క్యాంపులకు తిరిగేవాడా
విఘ్నే: తెలీదండీ
విఘ్నే: ఏదో ఆఫీసరుకదా అని ముచ్చట పడి ఆ తాడుకట్టించుకున్నావ్. ఇపుడు ఈ సంసారం ఈదేసరికి పాపం నీ తాడు తెగుతోంది కదూ. పోనీ నీవు కూడా మీ శ్రీవారితో పాటే క్యాంపులకు వెళ్లకూడదు. హాయిగా అన్నీ ఊళ్లూ చూడొచ్చు.
మీ: మీరు చెప్పేది బాగుందండీ. సంసారాన్ని పెట్టమంటారా?
వి: లవ్వంటూ ఉండాలేగానీ, లాడ్జింగ్‌ల్లో అయినా ఫర్వాలేదు. లాకప్పుల్లో అయినా ఫరవాలేదు. ఇద్దరి మనసులూ పురివిప్పిన నెమళ్ళులా నాట్యం చేస్తే చాలు.
మీ: ఆ! ఆ చేస్తూనే వున్నయ్
వి: ఇంతకూ మీ పేరే చెప్పలేదు.
మీ: మీనాక్షి. సింపుల్‌గా మీనా అంటారంతా.
వి: మీ పేరు చివర్న మీ శ్రీవారి పేరు చేర్చలేదేం?
మీ: ఈ కలియుగంలో ఎవరెప్పుడు కలుస్తారో, ఎవరెప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. అందువలన ఎవరి పేరు వారికే వుండటం మంచిది.
వి: కలిసినపుడు అతికించుకోవటం, విడిపోయినపుడు వదిలించుకోవటం అవివేకమే మరి. ఒకరకంగా చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులకూ, లక్ష్మీ నారాయణులకూ మాత్రమే ఆ పేర్లు అలా అమరినయ్ మరి. అలా అందరూ వుంటే ఈ విడాకులూ, ఈ తమలపాకులూ వుండనే వుండవ్.
మీ: వేదాంత ధోరణిలో మీరు చెప్పింది బాగానే వుందిగానీ, ఆచరణలో అది అసాధ్యం.
వి: అలవాటు చేసుకుంటే ఆలస్యంగానయినా సాధ్యమే.
మీ: అయితే విడాకులలదాకా రావటం అనవసరమని మీ అభిప్రాయమా?
వి: విడాకులు దాంపత్య జీవితాన్ని దూరం చేయగలవేమో గానీ, పిల్లల భవిష్యత్తును బాగా దెబ్బతీస్తయ్. తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ప్రయోజకులౌతారు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా వాళ్ళు మానసికంగా కృంగిపోతారు.
మీ: మీరు విడాకుల్ని గురించి చాలా విషయాలు చెప్పారు. మరి నాకు సెలవిప్పిస్తారా!
వి: బాగుంది వరస. అసలు మీరెందుకొచ్చినట్లు
మీ: నేను ‘ఆడజన్మ’ మాసపత్రికకు విలేఖరిని. త్వరలోనే విడాకులు శీర్షిక క్రింద ఓ వ్యాసం ప్రచురిద్దామనుకున్నాం. విషయ సేకరణకు మీతో ఇంటర్వ్యూ జరిపాను. చాలా థాంక్సు. చాలా విషయాలు చెప్పారు.
వి: విలేఖరివా! నీకు విడాకులక్కర్లేదన్నమాట. ఆ మాట ముందే చెప్పొచ్చుగా.
మీ: ముందే చెప్తే మూడు ముక్కల్లో చెప్పి పంపిస్తారు.
వి: మంచి అనుభవం గల అమ్మాయివిలానే వున్నావ్. ఇంతకు మీ ఆయన చాలా లక్కీఫెలో!
మీ: నాకు పెళ్ళే కాందే.
వి: అయితే ఇంకేం మంచి సంబంధం చూస్తాను.
మీ: వద్దండీ! మళ్లీ మీరు పేరు మార్చుకోవాల్సి వస్తుంది.
వి: ఈ విఘ్నేశ్వరుని విడాకులే బాగున్నాయన్నమాట.
మీ: అవును, మీ విడాకులకు విఘ్నాలుండవ్. (ఇద్దరూ పెద్దగా నవ్వారు)
-సమాప్తం-
(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.