Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఘ్నేశ్వరుని విడాకులు
*
మీన: మీ ధోరణి చూస్తుంటే మీరు నాటకాల్లో కూడా మంచి అనుభవం ఉన్నట్లుంది.
విఘ్నే: అవునవును. ఈరోజుల్లో నాటకాడాడేదే ప్లీడర్లు. ప్లీడరు గుమాస్తాలు. అయితే ఎక్కువగా పౌరాణికాలే ఆడుతుంటాం. రాగాలాపనకు అలవాటు పడ్డవాళ్లం.
మీన : ఆలాపన లేకుండా ఆడకూడదా.
విఘ్నే; ఆడవచ్చు. అయినా దేవుడు ప్రత్యక్షం కాగానే భక్తునికి వరాలిచ్చి వెళ్తే రక్తి కట్టదు. ఇద్దరూ కనీసం చెరో నాల్గు పద్యాలన్నా పాడాలి.
మీన: పాపం చాలా శ్రమపడ్తారు. కానీ ఈనాడు గుర్తించేదెవరు? అంతా సినిమా లోకం.
విఘ్నే: ఇంతకూ మీరొచ్చిన పని చెప్పనే లేదు. అర్జెంటుగా వెళ్లాలని కూడా అన్నారు. మీకు వివాహమై ఎంతకాలమైంది.
మీన: ఆ! ఆ! అవును చెప్పనేలేదు. ఆరేళ్లయింది
విఘ్నే: పిల్లలు!
మీన: ఒక మగ ఒక ఆడ
విఘ్నే: ఓహో !బాగుంది. నియంత్రణా మంత్ర పారాయణ మనమాట మర్చేపోయా! మీ ఇద్దరూ ఎన్నాళ్లుగా విడిగా ఉంటున్నారు.
మీన: మీ ఇంటకొచ్చే వాళ్లను ముందడిగే ప్రశ్న ఇదేనన్నమాట
విఘ్నే: అవసరం అలానే అడిగిస్తుంది. ఒకసారి ఏమైందో తెల్సా. ఒకేరోజు భార్యభర్తలిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు నా దగ్గరకొచ్చారు. తామిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నట్లు తమ మధ్య ఏవిధమైన అభిప్రాయ భేదాలు లేనట్లు ఆవిషయాన్ని నన్ను నా మనసులోనే ఉంచుకోమని, చెప్తూనే ఇద్దరూ విడాకులకు దావా వేశారు. కోర్టువారు నా వాదన ప్రభావంతో వాళ్లకు విడాకులిచ్చారు. అయితే ఆ ఇద్దరూ కాపురం చేస్తూనే ఉన్నారు. వాళ్లకు విడాకులెందుకో నాకర్థం కాలేదు.
మీన: బ హుశా! అడ్వాన్సు విడాకులేమో!
విఘ్నే: అప్పట్నుంచి నాదగ్గర కొచ్చే వాళ్లందరికీ వాళ్ల తగాదాలు తీవ్రస్థాయికి చేరుకోనిదే కేసు ఫైలు చేసుకోవడం లేదు. కొందర్ని కోర్టు దాకా రానివ్వకుండా ఇక్కడే వాదించి వాల్ల కాపురాల్ని నిల్పుతున్నాను. వాళ్లు ఆ ఆనందంలో అసలు ఫీజు కన్నా ఎకుకవే ముట్టచెబుతున్నారు.
మీన: మీలాంటి లాయర్సు ఏ కొద్దిమందో ఉంటారంటీ. నిజంగా అవసరమనుకున్న కేసుల్ని కోర్టులోనూ, తమాషాగా అనుకున్న కేసుల్ని ఇంట్లోనూ పరిష్కరిస్తున్నారన్నమాట.
విఘ్నే: విడాకులిప్పించిన కేసులకన్నా కుటుంబాల్ని కలిపిన కేసులే ఎక్కువ.
మీన: చూడండి. విడాకుల విఘ్నేశ్వరం గారు మీ దగ్గర కొచ్చిన వింత విడాకుల కేసు ఏమైనా ఉందా.
మీనా పెన్నుతో నోట్‌బుక్‌లో ఏదో వ్రాసుకుంది
విఘ్నే: ఏవిటీ! ఏదో మధ్యమధ్య నోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పేదంతా కూడా వ్రాసుకుంటారా ఏమిటి?
మీన: అబ్మే ఏం లేదు మీరు చెప్పండి.
విఘ్నే: ఒకరోజు ఇద్దరు చిన్న పిల్లలు వచ్చి మా అమ్మనాన్నలను విడదీయమని చెప్పారు. వాళ్ల నాన్న రోజూ తాగొచ్చి వాళ్లమ్మను కొడుతున్నాట్ట.
మీన: విడాకులిప్పించారా
విఘ్నే; వెంటనే సాయం చేశాను.
మీన; మీ దృష్టిలో ఇలాంటి కేసులు సహజమని మీ అభిప్రాయామా
విఘ్నే: అర్థవంతమైన వేదన వున్నపుడు మాత్రమే ఎడబాటు కోరాలి గానీ మా ఆయన నన్ను గౌనేసుకోమన్నాడు. నాకిష్టం లేదు. విడాకులిప్పించండి. మా ఆవిడ చీర కట్టుకోదు నాకు విడాకులిప్పించండి. అంటే చాలా సిల్లీగా ఉంటుంది.
మీన: భార్యభర్తల్లో ఏ ఒక్కరికైనా గానీ ఏదైనా అక్రమ సంబంధం ఉన్నప్పుడు అది నిజమని ఋజువైనపుడు విడిపోవడం న్యాయం కదా.
విఘ్నే: ఇప్పుడర్థమైంది మీ కేసు
మీన: ఏమర్థమైంది
సత్యధర్మాలు
(ఇంకా ఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.

-షణ్ముఖశ్రీ- 8897853339