రివ్యూ

అష్టకష్టాల్లో కామెడీ కృష్ణుడు! -- * కృష్ణాష్టమి (బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
సునీల్, నిక్కీ గాల్రాని, డింపుల్ చోప్డే, బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, అసుతోష్‌రానా, సప్తగిరి, పోసాని తదితరులు
సంగీతం: దినేష్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం:
వాసు వర్మ

ఈమధ్య తెలుగు దర్శక నిర్మాతలు కథలపై కష్టపడకుండా సేఫ్ జోన్‌లో చేస్తే సరిపోతుందనే భ్రమలో ఉంటున్నారు. కథను వదిలేసి హంగూ ఆర్భాటాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సక్సెస్‌రేట్ సింగిల్ డిజిట్‌లోనే ఉంటోంది. కామెడీని వదిలేసి హీరో అయన సనీల్, వరుస ప్లాప్‌ల తరువాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కృష్ణాష్టమి. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌పై రావడంతో అంచనాలు ఎక్కువయ్యాయ. జోష్ తరువాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు వాసువర్మ రూపొందించిన సినిమాలో గ్లామర్ భామలు డింపుల్ చోప్డే, నిక్కి గాల్రనీ హీరోయిన్లు. సునీల్‌కి కృష్ణాష్టమి కలిసొచ్చిందో లేదో చూద్దాం.
కృష్ణ (సునీల్)ని చిన్న వయసులోనే అమెరికాకి పంపేయడంతో అక్కడే పెరుగుతాడు. కానీ, ఇండియా అన్నా, ఇక్కడి సంప్రదాయాలన్నా, మానవతా విలువలున్న మనుషులన్నా కృష్ణకి చాలా ఇష్టం. దీనికితోడు ఎదుటివారి ముఖంలో సంతోషం చూడడానికి ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే మనస్తత్వం. కృష్ణకి అమెరికా అమ్మాయన్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లన్నా ఇష్టం ఉండదు. అందుకే అమ్మాయిల వేటలో ఇండియా బయలుదేరుతాడు. ఈ జర్నీలో చూసిన ఎన్నారై ఇండియన్ గర్ల్ పల్లవి (నిక్కీ గాల్రాని)ని చూసి ప్రేమలో పడతాడు. అదే జర్నీలో పరిచయమైన అజయ్‌కుమార్ (అజయ్)కి ఉన్న సమస్యని పరిష్కరించడం కోసం అజయ్ ప్లేస్‌లో కృష్ణ నాగులాపల్లిలోని మరో ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అప్పటికి కృష్ణని చంపడానికి కొందరు పన్నాగం పన్నడమేకాకుండా అటాక్ చేస్తారు. అసలు అజయ్ పనిమీద వచ్చిన కృష్ణని ఎవరు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ నాగులపల్లికి కృష్ణకి ఉన్న సంబంధమేమిటి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
సునీల్ హీరో అయనా ప్రేక్షకులు కామెడీని ఆశిస్తారు. కానీ ఇందులో కామెడీ చేసి నవ్వించింది పెద్దగా ఏంలేదు. సందర్భానుసారం కామెడీ కోసం సునీల్‌ను వాడుకోలేకపోయారు. సునీల్‌ని యాక్షన్ ఎపిసోడ్స్‌లో చూపించడం కోసమే కామెడీని తగ్గించినట్టుంది. అదీకాక యాక్షన్ హీరోలో ఉండాల్సిన క్వాలిటీని సునీల్ ప్రదర్శించలేకపోయాడు. పవర్‌ఫుల్ డైలాగ్సూ పేలవంగా ఉన్నాయ. సినిమా మొత్తం చూసుకుంటే సునీల్ డాన్సులు ఒకే తప్ప మిగతా విషయంలో మెప్పించలేకపోయాడు. నిక్కిగాల్రాని చూడడానికి ముద్దుగా బొద్దుగా గ్లామర్‌కే పరిమితమైంది. నటనపరంగా చెప్పుకోదగిన పాత్ర కాదు. డింపుల్‌చోపడే పల్లెటూరి అమాయకురాలిగా కనిపిస్తూనే గ్లామర్‌ను ప్రదర్శించింది. బ్రహ్మానందం సెల్ఫీబల్ఫీగా చేసిన సీన్స్ నవ్విస్తాయి. ముఖేష్‌రుషి, అసుతోష్‌రానాలు తమ పాత్రల్లో ఎమోషన్స్‌ని బాగా పలికించారు. సప్తగిరి, పోసాని కృష్ణమురళిలాంటి కమెడియన్స్ ఓకే అనిపించారు.
తెలుగు సినిమా పాత సాంప్రదాయాన్ని ఫాలోకావాలనుకున్నాడు దర్శకుడు. కానీ వర్కవుట్ అవ్వలేదు. కథకోసం కొత్తపుంతలు తొక్కకుండా ఎలాంటి రిస్కుచేయకుండా గతంలో తెలుగులో వచ్చిన చాలా సినిమాల్లోని సీన్స్‌ని కలిపి కుట్టేసాడు. వాసువర్మ చేసిన ప్రయత్నాలు తెరపై మెరిసేలా ఉన్నా, కథ ప్రేక్షకులకి పరమరొటీన్ ఫీలింగ్‌ను కలిగించింది. నిర్మాత దిల్‌రాజు అంచనాలు పూర్తిగా దెబ్బతిన్నాయ. దానికితోడు ఎన్నోసార్లు ట్రిమ్‌చేసి 140 నిముషాలకే సినిమా కుదించినా లెంగ్తీగానే అనిపిస్తుంది. వాసువర్మ ఎంచుకున్న కథనం నేరేషన్ డిజాస్టర్ అయ్యాయి. ఇక వాసువర్మ దర్శకత్వ ప్రతిభ విషయానికివస్తే కృష్ణాష్టమి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇలాంటి తరహా సినిమాలో కొన్ని సెంటిమెంట్ ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్ సినిమాకి మరింత బలాన్నిస్తాయి. కానీ ఇందులో అవే మిస్సయ్యాయ. ఎమోషనల్‌గా కనెక్టయ్యే పాయింట్ ఒక్కటీ లేదు. కథ పాతది. దానికి కనెక్టయ్యే టిపికల్ స్క్రీన్‌ప్లే కూడా హెల్ప్ కాకపోవడంతో డైరక్టర్‌గా మరోసారి ఫెయిలయ్యాడనే చెప్పాలి. చోటా కె నాయుడు విజువల్స్, దిల్‌రాజు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి ఒక ప్లస్. చోటా కెనాయుడు పల్లెటూరి నేపథ్యాన్ని కూడా బాగా చూపాడు. మ్యూజిక్ డైరక్టర్ దినేష్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు, నేపథ్య సంగీతం బావుంది. ఎస్.రవిచందర్ ఆర్ట్‌వర్క్ ఓకే. యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయ. రెగ్యులర్‌గా వచ్చే ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములా కథ తీసుకుని దానికి చిన్న కలరింగ్ ఇచ్చి చేసిన సినిమానే కృష్ణాష్టమి. అసలే ఫ్లాప్‌లతో వున్న సునీల్ కెరీర్‌ని మరింత డేంజర్‌కి తీసుకెళ్లే స్టోరీ. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒక్క టికెట్‌పై -ఎన్నో సినిమాల సీన్లు చూపించిన సినిమా కృష్ణాష్టమి.

-త్రివేది