Others

ప్రమాదాలు చెప్పి రావు! జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కుర్రకుంక విలాసంగా ఎగరేసిన ‘సిగరెట్ పీక’ పూరి గుడిసెల్ని కాల్చేయడం మనం చూశాం చాలా సార్లు. కానీ, జర్మనీకి చెందిన ఒక పెద్దమనిషి స్పెయిన్‌లో వున్న క్యానరీ దీవులలో వున్న లాసాల్మా ప్రాంతంలోకి పోయి, ‘‘ఇది పాడయిపోయిందనీ, దాన్ని ఏం చెయ్యాలీ అనుకుంటూ తన ‘టాయిలెట్ పేపర్స్’ని అడవి అంచున తగలెట్టాడు. అవి భగ్గున మండి మొత్తం అడవిలోనే దావానలం సృష్టించాయి. మొత్తం నాలుగువేల హెక్టార్ల అడవి భూములు- ఆకాశాన్నంటే మంటలతో, పోయిన శుక్రవారం నుండీ తగలడుతూనే వున్నాయి రుూ బుధవారందాకా.
ఈ మంగళవారంనాటికి కూడా తగ్గని మంటలను అరికట్టడం కోసం మూడు విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, సైన్యం తంటాలు పడుతూనే ఉన్నారు! ఓ ఫారెస్ట్ గార్డ్ సజీవ దహనం కాగా- రెండు వేల ఐదు వందలమందిని తరలించారు.
ఈ టాయిలెట్ కాగితాన్ని కాల్చిన పెద్దమనిషి ఇరవై ఏడేళ్ళ యువకుడు. అమాయకంగా పోలీసుల దగ్గరకు వచ్చి చెప్పాడు. ‘‘పాడైపోయింది కదాని, అక్కడ పడేసి, అగ్గిపుల్ల గీశాను. అంతే సార్!’’ అన్నాడు.