ఆంధ్రప్రదేశ్‌

కన్నుల పండువగా భూతప్పల ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం భూతప్పల ఉత్సవం కన్నులపండువగా జరిగింది. భూతప్పలు భక్తులపై నుంచి నడుచుకుంటూ వెళ్లే దృశ్యాన్ని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. భూతప్ప విగ్రహాన్ని చేతపట్టుకున్న వారి కాలిస్పర్శ తగిలితే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. దీనికోసం గ్రహ పీడితులు, దీర్గకాలిక వ్యాధి పీడితులు, సంతానం లేని వారు, పెళ్లికాని వారు కోర్కెలు ఫలించాలంటూ చన్నీటి స్నానం చేసి తడిబట్టలతో దారికి అడ్డంగా బోర్లా పడుకుంటారు. భూతప్పలు నాట్యం చేస్తూ వారిపై నుంచి నడుచుకుంటూ వెళ్లే దృశ్యం ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.