సబ్ ఫీచర్

కనురెప్ప పడితే కనరాని లోకాలకే?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు భద్రత విషయంలో వాహనాల చోదకుల తప్పిదాలే పెను ప్రమాదాలకు ఆలవాలమవుతుంది. రహదారులు రక్తసిక్తమై ప్రమాదంలో అసువులు బాసే వారు కొందరైతే, కాళ్లుచేతులు విరిగి శరీరంలోని అంగాలు కోల్పోయి జీవితాంతం దుర్భర దుస్థితికి చేరుకోవడం మరికొందరి వంతు అవుతుంది. వాహనాల చోదకుల మనఃస్థితినిబట్టి అమితవేగంతో వాహనాలు నడపడం, ఓవర్‌టేక్‌లు చేయడం, మద్యం సేవించి నడపడం, రాకపోకలలో రవాణారంగ నిబంధనల్ని తుంగలో తొక్కి ఇచ్ఛమేర ప్రయాణించడం, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడే రెండు చెవులకు స్పీకర్ క్లిప్‌లు పెట్టుకొని పాటలు ఉత్సాహంతో పాటు మనస్సును వాహనాలు నడిపే తీరుపై గురిపెట్టకుండా ఎదురుగానో, లేదా వెనకవస్తున్న భారీ వాహనాలను లక్ష్యపెట్టకుండా స్వయం ఆనందం పొంగులువారి ముందుకెళుతున్న లేదా వెనుక వస్తున్న వాహనాల బారినపడి భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించే మానవ తప్పిదాలు కోకొల్లలుగా నిత్యం కట్టెదుట దర్శనమివ్వడం ఆనవాయితీ అయిపోయింది. తమ ప్రాణాలు పోయిందే కాకుండా కని పెంచినవారి భవిష్యత్తుకు బంగారు బాటలువేయాలని కలలుగన్న కుటుంబ సభ్యుల్ని నిరంతర ఆవేదనకు గురిచేస్తున్నారు.
విశ్రాంతి, నిద్ర కరువైన డ్రైవర్లు మొండి ధైర్యం డ్రైవర్లేకాకుండా అందులోని ప్రయాణికుల్ని సైతం పైలోకాలకు పంపేస్తున్నారు. ఆ రెప్పపాటు ఏమరుపాటే ప్రాణాలను బలిగొంటూ ఉంది. దానికితోడు సేఫ్టీ బెల్టులు వేసుకోవడంలో నిర్లక్ష్యం, ఇంకొంచెం సేపు ప్రయాణిస్తే గమ్యం చేరిపోవచ్చన్న ఆత్రుత. దానికి తగ్గట్టు అతివేగం, నిద్రను నిభాళించుకొనే శక్తి తమకుందనే అతి ధీమా కుటుంబాలకు కుటుంబాలనే ప్రమాద నెపంతో బలిగొంటున్న దారుణ ఘోర ప్రమాదాల వెంట బలిపశువులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా ప్రమాదాలు ఇటీవల కాలంలో పెచ్చు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మానవుడు ఒక పూట తిండిలేకపోయినా భరిస్తాడు కానీ నిద్ర మత్తు తలకెక్కిందంటే రెప్పపాటులో జరగరాని ఘోరప్రమాదం ఎదురై ప్రాణాలు గల్లంతయ్యే పరిస్థితి దాపురిస్తుంది.
భారీ వాహనాలకు రేడియం టేపు అంటించాలి
రాత్రివేళ భారీ వాహనాలను రోడ్డుప్రక్కగా నిలపడం ఒక కారణమైతే రేడియం టేపో లేదా లైట్లు వేయకపోవడంవలన వెనకనుండి వచ్చే వాహనాల చోదకులు నిలిపివున్న వాహనాన్ని గుర్తించలేక ఢీకొట్టడం జరుగుతోంది. డ్రైవర్లకు తగినంత విశ్రాంతి లేకపోవడం, అరకొర నిద్రనుండి మేల్కొని ప్రయాణం సాగించడంవల్ల విపత్తును కొనితెచ్చుకొన్నట్లే అవుతుంది. వాహన చోదకునికి ఆవలింతలు రావడం, తెలియకుండానే కళ్లు మూతలు పడతాయి. వాహనం రోడ్డు లేన్ తప్పడం, ఇతర వాహనాల అంచులు తాకుతూ వెళ్ళి రోడ్డు సూచీలు, మలుపులు గుర్తించలేక పోవడంతో ప్రమాదాలు జరగడం అనివార్యమవుతుంది. రెప్పపాటు కునుకే మరో లోకానికి దారిచూపుతుంది.
రహదారులు మరమ్మత్తులు
కరువై నోరు తెరుచుకొని ఉంటాయి
ఎన్నో ఏండ్లుగా మరమ్మత్తులకు నోచుకోక, అంతంతగా వేసిన ప్యాచీలు వర్షానికి వాహనాల రాపిడికీ కొట్టుకుపోయి గోతులుగా మారి వాహనాల వేగం తట్టుకోలేక బోర్లాపడడం రోడ్డు అంచులు కోసుకుపోయి గతితప్పి ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. రహదారి భద్రతపై రెండంచెలు, నాలుగంచెలు రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నా ప్రమాదాలపై వాహనదారులు అవగాహనతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవడంవలన పెనుప్రమాదాల నివారణకు నాందీ పడుతోంది.

- దాసరి కృష్ణారెడ్డి 9885326493